పుల్వామా దాడిలో ప్రాణాలర్పించిన వారికి జమ్ముకశ్మీర్‌లోని లెథ్‌పొరా సీఆర్పీఎఫ్ శిబిరంలో ఉన్నతాధికారులు నివాళ్లు అర్పించారు. దిల్లీ ప్రధాన కార్యాలయం నుంచి వర్చువల్ పద్ధతిలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
"ఆ దారుణాన్ని క్షమించలేదు. దాన్ని మరచిపోలేం. దేశం కోసం ప్రాణాలర్పించిన మా సోదరులకు వందనం. ఆ వీర జవాన్ల కుటుంబాలకు మా సంఘీభావం" అని సీఆర్పీఎఫ్ ట్వీట్ చేసింది. మరోవైపు నాటి ఘటనలో అమరులైన 40మందికి అంకితమిస్తూ రూపొందించిన ఒక వీడియో పుస్తకాన్ని సీఆర్పీఎఫ్ డీజీ ఏపీ మహేశ్వరి ఆవిష్కరించారు. అందులో 80 భాగాలుగా 300 నిమిషాల వీడియో ఉంది.
ఇదీ చూడండి: కశ్మీర్లో భారీ ఉగ్రదాడికి కుట్ర