ETV Bharat / bharat

Dharani Portal Telangana How it Works : "ధరణి" పోర్టల్ ఎలా పనిచేస్తుంది? రైతులకు ఎలా ఉపయోగపడుతుంది..? - తెలంగాణ ధరణి పోర్టల్ తో రైతులకు ఉపయోగమా

Registrations with Dharani Portal : తెలంగాణ రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసింది "ధరణి" పోర్టల్. రాష్ట్ర సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ.. e-గవర్నెన్స్ పోర్టల్ ఎలా పని చేస్తుంది..? దీనివల్ల రైతులకు ఏమైనా మేలు జరుగుతోంది? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

Dharani Portal Telangana How it Works
Dharani Portal Telangana How it Works
author img

By

Published : Aug 16, 2023, 12:06 PM IST

Updated : Aug 16, 2023, 12:16 PM IST

Dharani Portal in Telangana : భూములు, ఆస్తుల విక్రయాల్లో భారీగా అవినితి పెరిగిపోయిందని, సమయం కూడా చాలా వృథా అయిపోతోందనే ఉద్దేశ్యం రాష్ట్ర ప్రభుత్వం "ధరణి" వ్యవస్థను తీసుకొచ్చింది. ఈ ఆన్ లైన్ కాలంలో.. పాత పద్ధతులన్నీ పనికిరాకుండా పోయాయని, సమూల ప్రక్షాళన చేపట్టింది. ఇకపై జరిగే భూ లావాదేవీల్లో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా "ధరణి"ని తీసుకొచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది. మరి, ఈ పోర్టల్ ఎలా పనిచేస్తుందో (How to Use Dharani Portal) ఓ సారి చూద్దాం.

"ధరణి" ఎలా పనిచేస్తుంది..?

How Dharani Portal Works?

  • ధరణి పోర్టల్ రెండు విభాగాలుగా పని చేస్తుంది. (How to Check Dharani Portal) ఇందులో ఒకటి వ్యవసాయ ఆస్తులు. మరొకటి వ్యవసాయేతర ఆస్తులు.
  • సాగు భూములు వ్యవసాయ ఆస్తుల కేటగిరీలోకి వస్తాయి. ఇళ్లు, ఫ్లాట్లు, ఇతర వాణిజ్య నిర్మాణాలు వంటివి వ్యవసాయేతర ఆస్తుల జాబితాలోకి వస్తాయి.
  • వ్యవసాయ భూములను తహశీల్దార్ రిజిస్ట్రేషన్ చేస్తారు. వ్యవసాయేతర భూముల కోసం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్ల్లాలి.
  • ముందుగా ఆస్తిని విక్రయించే యజమాని విభాగాన్ని (వ్యవసాయ/వ్యవసాయేతర) ఎంచుకుంటారు. ఆ తర్వాత విక్రేత వద్ద ఉన్న రికార్డుల ప్రకారం మొత్తం సమాచారాన్ని ఫీడ్ చేస్తారు. డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేస్తారు.
  • ఆ తర్వాత రిజిస్ట్రేషన్ కోసం టైమ్ స్లాట్‌ను బుక్ చేసుకుంటారు.
  • కేటాయించిన సమయానికి ఆస్తిని అమ్మే వ్యక్తితోపాటు కొనుగోలు చేసే వ్యక్తి.. అన్ని పత్రాలతో కార్యాలయానికి వెళ్లాలి.
  • అక్కడ సబ్ రిజిస్ట్రార్ / తహశీల్దార్ వాటిని పరిశీలించి రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు.

ధరణి సమస్యల పరిష్కారంపై సర్కార్ కసరత్తు.. మాడ్యూళ్లపైనే ప్రత్యేక దృష్టి

పాత పద్ధతికీ.. ధరణికి తేడా ఏంటి..?

What is The Difference To Dharani And Previous Registration :

  • ఏదైనా ఆస్తిని విక్రయించాలన్నా.. లేదా వారసత్వం కింద బదిలీ చేయాలన్నా.. ముందుగా ధరణి పోర్టల్ లోకి లాగిన్ (How to Login in Dharani Portal) కావాలి.
  • గతంలో ఏదైనా ఆస్తి రిజిస్ట్రేషన్ పూర్తయితే.. దస్తావేజులు చూస్తే తప్ప తెలిసేది కాదని.. ఇప్పుడు మాత్రం ఆన్ లైన్ ద్వారా క్షణాల్లో తెలిసిపోతుందని అధికారులు చెబుతున్నారు.
  • ధరణి పోర్టల్ లోకి లాగిన్ కావడానికి భూమి యజమాని ఫోన్ నంబర్ కావాల్సిందే.
  • ఆ మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే.. దానికి OTP వస్తుంది. అది ఎంటర్ చేస్తేనే లాగిన్ అవుతారు.
  • మీ నంబర్ ద్వారా ధరణిలోకి లాగిన్ అయ్యారంటూ మళ్లీ మెసేజ్ వస్తుంది.
  • ఆ తర్వాత స్లాట్ బుక్ చేసుకోవాలనుకున్నా కూడా మొబైల్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దానికి వచ్చే OTP ద్వారానే స్లాట్ సాధ్యమవుతుంది.
  • స్లాట్ బుక్ అయిన తర్వాత.. ఏ రోజు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి రావాలి? ఏయే పత్రాలు తీసుకు రావాలి? చలానా ఎంత చెల్లించారు? వంటి వివరాలను వివిధ దశల్లో మెసేజ్ రూపంలో ఫోన్ కు వస్తాయి.
  • ఆఖరుగా.. యజమాని తన భూమిలో ఎంత వాటాను విక్రయించారు అనే వివరం కూడా మేసేజ్ రూపంలో వస్తుంది.
  • ఇలా.. వివిధ దశల్లో వచ్చే మెసేజ్ ల ద్వారా యజమాని అలర్ట్ గా ఉంటారని, ఎలాంటి అవినీతికి ఆస్కారం ఉండబోదని ప్రభుత్వం చెబుతోంది.

ధరణిలో కొత్త ఆప్షన్​​.. పాసుపుస్తకాల్లో తప్పులను సవరించుకునేందుకు అవకాశం..

సురక్షితంగా.. వేగంగా..

Safe and Fast Transactions with Dharani Portal :

  • ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ( How to Register in Dharani Portal) ఎలాంటి అవినీతి అక్రమాలు లేకుండా సురక్షితంగా పూర్తవుతుందని, అదేవిధంగా చాలా వేగంగా పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు.
  • పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికావడానికి రోజుల సమయం పట్టేదని, ధరణి ద్వారా.. కేవలం 30 నిమిషాల్లో పని పూర్తయిపోతుందని అధికారులు చెబుతున్నారు.
  • ధరణి కోసం.. రాష్ట్రంలోని 474 తహసీల్దార్ ఆఫీసుల్లో, 141 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్, స్కానర్లు, ప్రింటర్లు అందుబాటులో ఉన్నాయని ప్రకటించారు.
  • రిజిస్ట్రేషన్ ప్రక్రియ తర్వాత.. మ్యుటేషన్, హక్కుల ట్రాన్స్​ఫరు కూడా వెంటనే జరిగిపోతుంది.
  • స్లాట్ ఇచ్చిన సమయంలో ఆఫీసుకు వెళ్లలేకపోతే.. ఆ తర్వాత అందుబాటులో ఉన్న తేదీల్లో స్లాట్‌ను రీ-షెడ్యూల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.
  • రిజిస్ట్రేషన్ లేదా మ్యుటేషన్.. గంటలోనే పూర్తయిపోతాయని, పాత యజమాని పాస్‌బుక్‌లో మార్పులు, కొత్త యజమానికి కొత్త పాస్‌బుక్ జారీ చేయడం జరిగిపోతుందని చెబుతున్నారు.
  • వ్యవసాయేతర ఆస్తిపాస్తులకు మెరూన్ కలర్ పాస్‌బుక్ జారీ చేస్తారు.
  • వ్యవసాయ భూములకు గ్రీన్ కలర్ పాస్ పుస్తకాన్ని కొనసాగిస్తున్నారు.
  • ఈ కొత్త పద్ధతి ద్వారా.. అవినీతి అక్రమాలకు చరమగీతం పాడామని, రైతులకు నిక్కచ్చిగా, వేగంగా పని పూర్తవుతుందని ప్రభుత్వం చెబుతోంది.

Dharani passbook news : ఇకపై ఇంటికే పాసుపుస్తకాలు.. ఇవి సమర్పిస్తే చాలు!

భూముల విషయంలో తీరొక్క సమస్య.. మరి వాటిని తీర్చేది ఎలా..?

Last Updated : Aug 16, 2023, 12:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.