పార్లమెంటు సెంట్రల్ హాల్లో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొని ప్రసంగించారు(president ram nath kovind news). 72 సంవత్సరాల క్రితం ఈ సెంట్రల్ హాల్‌లోనే మన రాజ్యాంగ నిర్మాతలు స్వతంత్ర భారతదేశ ఉజ్వల భవిష్యత్తు కోసం రాజ్యాంగ ముసాయిదాను స్వీకరించారని కోవింద్ గుర్తు చేశారు. రాజ్యాంగ బలం వల్లనే దేశం అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు(constitution day 2021).
" మన దేశంలో మొదటి నుంచి మహళలకు ఓటు హక్కు మాత్రమే ఇవ్వలేదు. రాజ్యాంగ పరిషత్లో ఎంతో మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. రాజ్యాంగ నిర్మాణంలో వారి పాత్ర ఎప్పటికీ మరువలేనిది"
-రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.
భారత్ ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా ఉండాలని ప్రజలు కోరుకున్నారని, రాజ్యాంగ పీఠిక ఈ విషయాన్ని క్లుప్తంగా వివరిస్తుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రజా కేంద్రీకృతంగానే అభివృద్ధి జరుగుతున్నట్లు అందరం విశ్వసిస్తున్నామని చెప్పారు. 254వ రాజ్యసభ సమావేశాల్లో ఉత్పాదకత 29.60శాతానికి పడిపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 70 శాతం సభా సమయం వృథా అయిందని పేర్కొన్నారు. దీనిపై అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. దేశాభివృద్ధి, ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని పార్లమెంటు, చట్టసభలు సమర్థంగా పనిచేయాలన్నారు వెంకయ్య(vice president venkaiah naidu).
అనంతరం రాజ్యాంగ పీఠికను అందరూ చదివి వినిపించారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దీనికి నేతృత్వం వహించారు.
వారికి రుణపడి ఉంటాం
అంతకుముందు ట్విట్టర్ వేదికగా ప్రజలు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు వెంకయ్య. రాజ్యాంగ నిర్మాణానికి కృషి చేసిన డాక్టర్. బీఆర్ అంబేడ్కర్ సహా అనేక మంది మహనీయులకు భారతజాతి రుణపడి ఉందన్నారు. సమీకృత న్యాయం, స్వేచ్ఛ, సమానత్వమే ధ్యేయంగా రాజ్యాంగ నిర్మాణం జరిగిందని ట్వీట్ చేశారు(venkaiah naidu news).
ఇదీ చదవండి: వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ముప్పు: మోదీ