కార్తిక పౌర్ణమి (Kartik purnima 2021) సందర్భంగా దేవ్ దీపావళి వేడుకలు (Dev diwali 2021) పలు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని హర్ కీ పౌడీ ఘాట్‌కు (Har Ki Pauri Ghat, Haridwar) భక్తులు భారీగా తరలివచ్చారు. గురువారం రాత్రి ఏకంగా 11 వేల దీపాలు వెలిగించి.. ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు.
వేలాది దీపాలు ఒకేచోట వెలుగుతుండటం అద్భుతమని అన్నారు అఖాడా పరిషత్ అధ్యక్షుడు రవీంద్ర పురీ. హర్ కీ పౌడీలో జరుపుకున్నట్లే వేడుకలను అన్ని దేవాలయాల్లో నిర్వహించాలని పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది అన్ని పుణ్యక్షేత్రాల్లో అత్యద్భుతంగా వేడుకలు ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
హర్ కీ పౌడీకి రావడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దృశ్యాలు తమను అబ్బురపరిచాయని చెబుతున్నారు. బాణసంచా కాలుస్తూ సంబరంగా గడిపారు.
ఈ రోజున దేవతలు దీపావళి (Dev diwali 2021) జరుపుకుంటారని ప్రజలు నమ్ముతారు. స్వర్గం నుంచి భూమికి చేరుకొని దీపం వెలిగిస్తారని విశ్వసిస్తారు.
ఇదీ చూడండి: karthika pournami 2021 : కార్తిక పౌర్ణమి నాడు దీపారాధన ఎందుకు చేయాలంటే?