ETV Bharat / bharat

మావోయిస్టుల ఎదురుకాల్పుల్లో డిప్యూటీ కమాండెంట్ మృతి - లాతేహార్ జిల్లా న్యూస్

ఝార్ఖండ్​లో(Latehar News) మావోయిస్టులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఓ డిప్యూటీ కమాండెంట్​ మృతిచెందారు. ఈ కాల్పుల్లో(Maoist Encounter) ఓ నక్సలైట్​ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.

deputy commandent
డిప్యూటీ కమాండెంట్
author img

By

Published : Sep 29, 2021, 5:36 AM IST

ఝార్ఖండ్​ లాతేహార్(Latehar News)​ జిల్లాలో మావోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు(Maoist Encounter) జరిగాయి. ఈ కాల్పుల్లో డిప్యూటీ కమాండెంట్ ప్రాణాలు కోల్పోయారు.

ఝార్ఖండ్​ జాగ్వార్ డిప్యూటీ కమాండెంట్ రాజేశ్​ కుమార్​కు(Jharkhand Encounter) బుల్లెట్ గాయాలుకాగా ఆయనను రాంచీలోని ఓ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే.. అప్పటికే రాజేశ్​ మరణించినట్లు డాక్టర్లు పేర్కొన్నారు. ఈ కాల్పుల్లో ఓ నక్సలైట్​ను మట్టుబెట్టినట్లు అధికారులు తెలిపారు. అతడి నుంచి ఏకే 47 సహా పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఝార్ఖండ్​ పోలీసులు, జాగ్వార్ అధికారులు కలిసి కూంబింగ్​ ఆపరేషన్​ చేపడుతున్నట్లు ఓ అధికారి తెలిపారు. మరోవైపు సలయ్యా అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:రిటైర్మెంట్​కు నో అంటున్న​ 'సూపర్​ ఫిట్'​ శునకం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.