ఫిబ్రవరి 6న 'చక్కా జామ్' నిర్వహించడానికి రైతు సంఘాలు సిద్ధమవుతున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు దిల్లీ పోలీసు కమిషనర్ ఎస్ఎన్ శ్రీవాస్తవ. పరిస్థితులు అదుపుతప్పకుండా చూసేందుకు విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు షాకు వివరించారు కమిషనర్. ఈ భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ పాల్గొన్నారు.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఆందోళన చేస్తోన్న దిల్లీ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. గణతంత్ర దినోత్సవం రోజు దిల్లీలో అల్లర్లు జరిగిన తర్వాత భారీగా భద్రతా దళాలను మోహరించిన అధికారులు.. రైతులు దేశ రాజధానిలోకి ప్రవేశించకుండా భారీగా బారికేడ్లు, ఇనుప ఉచలతో పాటు కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారు.
ఇదీ చూడండి: 'చక్కా జామ్' కోసం రైతులు, పోలీసుల ముమ్మర ఏర్పాట్లు