తన గర్ల్‌ఫ్రెండ్ ను కలిసేందుకు వెళ్లాలనుకుంటున్నాని, వీకెండ్ తర్వాత మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయో లేదో స్పష్టత ఇవ్వాలని దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌ను ట్యాగ్ చేసి ట్విట్టర్లో ఓ పోస్టు పెట్టాడు యువకుడు. ఈసారి తన ప్రేయసిని కలవలేక పోతే అది వారి బ్రేకప్‌కు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశాడు.
దీనికి దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఫన్నీ రిప్లై ఇచ్చిందిం. బాలీవుడ్ ఎవర్గ్రీన్ హిట్ మూవీ దిల్వాలే దుల్హానియా లేజాయేంగే చిత్రంలో అమ్రిష్ పురి.. కాజల్, షారుక్‌ల ప్రేమను అంగీకరిస్తూ బొటన వేలు పైకెత్తిన సీన్‌తో మీమ్‌ను రూపొందించి జత చేసింది. 'మెట్రో సేవలు అందుబాటులోనే ఉంటాయి మిత్రమా. వెళ్లు జీవితాన్ని ఆస్వాదించు' అని కామెంట్ చేసింది.
ఈ సందర్భాన్ని ప్రచారానికి ఉపయోగించుకోవచ్చు అనుకుందో ఏమో.. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా ఇందులో జోక్యం చేసుకుంది. దిల్లీ మెట్రో రీఛార్జ్ కోసం అమెజాన్ వాలెట్‌ను ఉపయోగించుకోవాలని రిప్లై ఇచ్చింది. భౌతిక దూరాన్ని మరవొద్దని, ఇంట్లోనే రీఛార్జ్ చేసుకుని గర్ల్‌ఫ్రెండ్‌ను కలిసేందుకు వెళ్లమని యువకుడికి సూచించింది.
ఈ మొత్తం వ్యవహారంపై నెటిజన్లు కూడా ఫన్నీ కామెంట్లు చేశారు.
'ప్రేయసిని కలిసేందుకు ఎవరైనా మెట్రో కోసం ఎదురు చూస్తారా? ఉబర్ ఉంది కదా' అని ఓ యూజర్ బదులివ్వగా. 'మెట్రో సేవలు ఆగిపోతే నా బైక్ తీసుకెళ్లు' అని మరో నెటిజన్ రిప్లై ఇచ్చాడు. 'ఈ దిల్వాలే కోసం మెట్రో ఉంది' అని మరొకరు ఛలోక్తులు విసిరారు.
ఇదీ చూడండి: vaccination: అటు జాలర్లకు.. ఇటు ట్రాన్స్జెండర్లకు