చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్న జంటను విడదీయకూడదని, ప్రభుత్వానికి వారి వ్యక్తిగత జీవితాల్లో చొరబడే అధికారం లేదని దిల్లీ హైకోర్టు పేర్కొంది. బిహార్‌లో ఇల్లు వదలి తమ మతాచారాల ప్రకారం పెళ్లి చేసుకున్న ముస్లిం యువకుడు, ముస్లిం బాలిక కేసులో ఈ నెల 17న ఈ మేరకు తీర్పు ఇచ్చింది. వధువు ప్రస్తుతం గర్భవతి. తమను విడదీసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ దంపతులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్మీత్ సింగ్ పై తీర్పు చెప్పారు. వారిద్దరూ సమాజంలో భార్యాభర్తలుగానే ఉన్నారని, అందులో జోక్యం చేసుకోకూడదని పేర్కొన్నారు. ఒకవేళ వారిని విడదీసే ప్రయత్నాలు చేస్తే.. వారి వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించినట్లే అవుతుందని స్పష్టం చేశారు.
పుష్పవతి అయిన బాలిక తల్లిదండ్రులకు ఇష్టం లేకున్నా తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లాడి సహజీవనం చేయవచ్చని ముస్లిం పర్సనల్ లా సమ్మతిస్తుంది. 18 ఏళ్ల లోపు బాలికకూ ఈ స్వేచ్ఛనిస్తోంది. తదనుగుణంగా పిటిషన్‌దారులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశించింది.
ఇవీ చూడండి: నిద్రిస్తున్న భార్యను లేపి, రైలు కిందకు తోసి హత్య
అసెంబ్లీ ముందు రైతు ఆత్మహత్యాయత్నం, ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పు