కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది దిల్లీ సర్కారు. రేషన్ కార్డున్న 72 లక్షల మందికి రెండు నెలల పాటు ఉచితంగా రేషన్ సరుకులు అందించనున్నట్లు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు నెలకు రూ. 5000 ఆర్థిక సాయం చేయనున్నట్లు పేర్కొన్నారు.
దిల్లీలో మరో రెండు నెలలపాటు లాక్డౌన్ కొనసాగుతుందని ప్రజలు భయపడొద్దని కేజ్రీవాల్ అన్నారు. పరిస్థితులు అదుపులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గతేడాది లాక్డౌన్ సమయంలోనూ 1.56 లక్షల డ్రైవర్లకు నెలకు రూ. 5000 ఆర్థిక సాయం చేసినట్లు కేజ్రీవాల్ తెలిపారు.
ఇదీ చదవండి:బిహార్లో మే 15 వరకు లాక్డౌన్