Delhi Earthquake Today : దేశ రాజధాని ప్రజలను భూకంపం కలవరపాటుకు గురిచేసింది. దిల్లీ సమీపంలోని హరియాణా ఫరీదాబాద్‌లో ఆదివారం సాయంత్రం 4.08 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 3.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు జాతీయ భూకంప అధ్యయన విభాగం వెల్లడించింది.
-
"Earthquake of Magnitude:3.1, Occurred on 15-10-2023, 16:08:16 IST, Lat: 28.41 & Long: 77.41, Depth: 10 Km ,Location: 9km E of Faridabad, Haryana, India," posts @NCS_Earthquake. pic.twitter.com/6aF2GPZuxc
— Press Trust of India (@PTI_News) October 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">"Earthquake of Magnitude:3.1, Occurred on 15-10-2023, 16:08:16 IST, Lat: 28.41 & Long: 77.41, Depth: 10 Km ,Location: 9km E of Faridabad, Haryana, India," posts @NCS_Earthquake. pic.twitter.com/6aF2GPZuxc
— Press Trust of India (@PTI_News) October 15, 2023"Earthquake of Magnitude:3.1, Occurred on 15-10-2023, 16:08:16 IST, Lat: 28.41 & Long: 77.41, Depth: 10 Km ,Location: 9km E of Faridabad, Haryana, India," posts @NCS_Earthquake. pic.twitter.com/6aF2GPZuxc
— Press Trust of India (@PTI_News) October 15, 2023
భయంతో ప్రజల పరుగులు!
Earthquake Haryana Right Now : ఫరీదాబాద్‌కు తూర్పున 9 కిలోమీటర్లు, దిల్లీకి ఆగ్నేయంగా 30 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు జాతీయ భూకంప అధ్యయన విభాగం పేర్కొంది. భూప్రకంపనలతో ఫరీదాబాద్‌లోని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. దిల్లీ కూడా అనేక ఇళ్లల్లోని ఫర్నీచర్ తీవ్రంగా కదిలినట్లు సమాచారం. భయంతో జనం తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన వీడియోలను పలువురు నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.
-
Just felt earthquake here. Do you guys experience the same? #earthquake #earthquakes #Delhi pic.twitter.com/uo3MrQSdU0
— Shahanshah E Azam🗨🇮🇳 (@ShahanshahEAzam) October 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Just felt earthquake here. Do you guys experience the same? #earthquake #earthquakes #Delhi pic.twitter.com/uo3MrQSdU0
— Shahanshah E Azam🗨🇮🇳 (@ShahanshahEAzam) October 15, 2023Just felt earthquake here. Do you guys experience the same? #earthquake #earthquakes #Delhi pic.twitter.com/uo3MrQSdU0
— Shahanshah E Azam🗨🇮🇳 (@ShahanshahEAzam) October 15, 2023
భూకంపం.. బయటకొచ్చిన కేంద్ర మంత్రి!
Delhi Earthquake 2023 : కొద్దిరోజుల క్రితం.. దిల్లీలో రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతో భూకంపం సంభవించింది. నేపాల్‌లో ఐదు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు జాతీయ భూకంప అధ్యయన విభాగం అధికారులు గుర్తించారు. దిల్లీతో సహా పొరుగున ఉన్న పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, హరియాణా రాష్ట్రాల్లో కూడా 40 సెకన్లపాటు భూమి కంపించిందని వెల్లడించారు. భూకంప సమయంలో సెంట్రల్ దిల్లీలోని నిర్మాణ్ భవన్లో ఉన్న కేంద్ర ఆరోగ్య మంత్రి మనసుఖ్ మాండవీయ.. అధికారులతో కలిసి బయటకు వచ్చేశారు. ఆ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
గాఢనిద్రలో ఉండగా మూడుసార్లు భూప్రకంపనలు..
Earthquake In Jaipur : కొన్ని నెలల క్రితం.. రాజస్థాన్ రాజధాని జైపుర్‌లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉదయం 4 గంటల సమయంలో తొలి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.4 గా నమోదైంది. ఆ తరువాత 20 నిమిషాలకు 3.1 తీవ్రతతో మరో భూకంపం వచ్చింది. మరో 5 నిమిషాల వ్యవధిలో 3.4 తీవ్రతతో మూడో భూకంపం నమోదైంది. గాఢనిద్రలో ఉన్నప్పుడు భూమి ఒక్కసారిగా కంపించడం వల్ల ఏం జరుగుతుందో తెలియక భయాందోళనకు గురయ్యామని ప్రజలు తెలిపారు.
మైనస్ 22 డిగ్రీల చలిలో అల్లాడుతున్న భూకంప బాధితులు.. 6 రోజులుగా కార్లలోనే నిద్ర
ఓవైపు తుఫాన్.. మరోవైపు భూప్రకంపనలు.. గుజరాత్ ప్రజల్లో ఆందోళన