జవాన్ల అత్యవసర వైద్యం కోసం రూపొందించిన బైక్ అంబులెన్స్‌లు దిల్లీలో సోమవారం అందుబాటులోకి వచ్చాయి. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్), రక్షణ పరిశోధన సంస్థ(డీఆర్‌డీఓ)లు వీటిని సోమవారం లాంఛనంగా ప్రారంభించాయి. నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలు, ఇరుకైనదారుల్లో సులువుగా చేరుకునేలా 'రక్షిత' పేరుతో ఈ బైక్ అంబులెన్స్‌ను రూపొందించారు.
![bike ambulance for jawans](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10281767_361.jpg)
![bike ambulance for jawans](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10281767_362.jpg)
![bike ambulance for jawans](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10281767_5256.jpg)
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్), ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ & అల్లీడ్ సైన్సెస్ (ఇన్మాస్), డీఆర్‌డీఓ సంస్థలు సంయుక్తంగా ఈ బైక్ అంబులెన్స్‌లను అభివృద్ధి చేశాయి. అడవుల్లో సమయానికి వైద్యం అందక సామాన్య ప్రజలు, జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి ఘటనలు జరగకుండా ఉండే లక్ష్యంతో వీటిని రూపొందించామని తెలిపాయి తయారీ సంస్థలు.