ETV Bharat / bharat

వేర్పాటువాద నేత యాసిన్‌ మాలిక్‌ను దోషిగా తేల్చిన కోర్టు

Yasin Malik: ఉగ్రవాదులకు నిధులు అందించిన కేసులో కశ్మీర్‌ వేర్పాటువాద నేత యాసిన్‌ మాలిక్‌ను దిల్లీలోని పటియాల హౌస్‌ కోర్టు దోషిగా తేల్చింది. ఈ నెల 25న యాసిన్​ మాలిక్​కు న్యాయస్థానం శిక్షను ఖరారు చేయనుంది.

yasin malik
yasin malik
author img

By

Published : May 19, 2022, 1:25 PM IST

Yasin Malik: జమ్ముకశ్మీర్​ వేర్పాటువాద నాయకుడు యాసిన్​ మాలిక్​ను పటియాల ప్రత్యేక ఎన్‌ఐఎ కోర్టు గురువారం దోషిగా తేల్చింది. ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేశారన్న కేసులో కోర్టు తాజాగా తీర్పును వెలువరించింది. ఈ నెల 25న యాసిన్‌మాలిక్‌కు న్యాయస్థానం శిక్ష ఖరారు చేయనుంది.టెర్రర్‌ఫండింగ్‌కేసులో తనపై నమోదైన అన్ని అభియోగాలను యాసిన్‌మాలిక్‌ అంగీకరించాడు. యాసిన్ మాలిక్ ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవాలని.. ఆతడి ఆస్తులకు సంబంధించి అఫిడవిట్ ఇవ్వాలని కోర్టు ఎన్‌ఐఎని ఆదేశించింది.

ఈ కేసులో లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్​, హిజ్బుల్​ ముజాహిద్దిన్​ చీఫ్​ సయ్యద్​ సలావుద్దీన్​ సహా పలువురు వేర్పాటువాద నేతలపై ఎన్​ఐఏ ఛార్జ్​షీట్​ దాఖలు చేసింది. జమ్ములో జరిగే వేర్పాటువాద కార్యకలాపాల్లో జేకేఎల్​ఎఫ్​ ముందుస్థానంలో ఉంటుంది. 1989లో జరిగిన కశ్మీరీ పండిట్​ల హత్యల్లోనూ వీరి పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి. వీరి దురాగతాలతో కశ్మీర్​ నుంచి భారీ సంఖ్యలో పండిట్​లు వలస వెళ్లారు. 1984లో జరిగిన భారత దౌత్యవేత్త రవీంద్ర మాత్రే హత్యతోనూ జేకేఎల్​ఎఫ్​కు సంబంధాలు ఉన్నాయి.

ఇదీ చదవండి: జ్ఞాన్​వాపి కేసు.. మేము విచారణ జరిపే వరకు మీరు ఆగండి: సుప్రీంకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.