దిల్లీ జఫ్రాబాద్‌లోని ఓ గ్యాస్ సిలిండర్ల దుకాణంలో శుక్రవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గ్యాస్ సిలిండర్ పేలుడు కారణంగా మంటలు భారీగా చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి.


క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు దిల్లీ అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో ఐదుగురు అగ్నిమాపక సిబ్బంది కూడా ఉన్నట్లు చెప్పారు.
అగ్ని ప్రమాదంలో ఒకరు మృతి
మరోవైపు.. దిల్లీ జహంగిర్పురిలోని తోమర్ కాలనీలో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. శుక్రవారం రాత్రి 9 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాద సమచారం తెలిసిన వెంటనే.. అగ్నిమాపక శాఖ సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకున్నారు. మూడు యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చారు.
ఇదీ చూడండి: విషాదం.. టపాసులు పేలి తండ్రీకొడుకులు మృతి