ETV Bharat / bharat

ఖైదీల హత్యకు కుట్ర- ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్

తిహార్​ జైలులోని పలువురు ఖైదీలను హత్య చేసేందుకు కుట్ర పన్నిన ఇద్దరు ఐఎస్​ఐఎస్​ ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. షాహిద్​ అనే మరో ఖైదీ ద్వారా ఈ పని చేయాలని భావించినట్లు వెల్లడించారు.

terror
ఇద్దరు ఐఎస్​ఐఎస్​ ఉగ్రవాదులు అరెస్ట్
author img

By

Published : Mar 22, 2021, 10:21 AM IST

తిహార్​ జైలులో ఇద్దరు ఐఎస్​ఐఎస్​ ఉగ్రవాదుల్ని దిల్లీ పోలీస్ ప్రత్యేక కార్యదళం​ ఆదివారం అరెస్ట్​ చేసింది. గతేడాది ఈశాన్య దిల్లీలో జరిగిన అల్లర్ల కేసులో అదే జైలులో ఉన్న నిందితులను హత్య చేసేందుకు ఈ ముష్కరులు కుట్ర పన్నారని పోలీసులు వెల్లడించారు. వీరిని ఐఎస్​ఐఎస్​ ఉగ్రవాద సంస్థకు చెందిన అబ్దుల్లా బాసిత్​, అజిమోషన్​గా గుర్తించారు.

దిల్లీ అల్లర్ల కేసు నిందితులను హత్య చేసే పనిని... అదే కేసులో నిందితుడు, తిహార్​ జైలులోనే ఉండే షాహిద్​కు అప్పగించారని ఎన్​ఐఏ అధికారులు వెల్లడించారు. షాహిద్​కు, అస్లామ్​ అనే వ్యక్తికి మధ్య జరిగిన ఫోన్​ సంభాషణ వినడం ద్వారా ఈ విషయం కనుగొన్నట్లు తెలిపారు.

"దిల్లీ అల్లర్ల కేసు నిందితుల హత్యకు ఉగ్రవాదులు కుట్ర పన్నారు. ఆ పనిని షాహిద్​​ అనే ఖైదీకి అప్పగించారు. ఈ విషయంపై షాహిద్​ను ఇప్పటికే విచారించాము. తోటి ఖైదీలతో జైలులో ఘర్షణకు దిగి, ఆ గందరగోళంలో ఈ హత్యలు చేయాలని అతడు భావించాడు. జైలులోకి పాదరసం తీసుకురావాలని అస్లాం అనే వ్యక్తికి సూచించాడు. ఐఎస్​ఐఎస్​ ఉగ్రవాదుల నుంచి ఆదేశాలు రాగానే... దిల్లీ అల్లర్ల కేసు నిందితుల శరీరాల్ని పాదరసంతో విషతుల్యం చేసి, హత్య చేయాలని కుట్ర పన్నాడు."

-పోలీసులు

నేరపూరిత కుట్ర, హత్యాయత్నం సహా మరికొన్ని సెక్షన్ల కింద అబ్దుల్లా, అజిమోషన్​పై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ కోసం వారిని నాలుగు రోజులు కస్టడీకి తీసుకున్నారు.

ఐఎస్​ఐఎస్​ అబుదబి మాడ్యూల్​లో భాగమైన అబ్దుల్లాను ఎన్​ఐఏ 2018లో హైదరాబాద్​లో అరెస్టు చేసింది. అప్పటి నుంచి అతడు తిహార్​ జైలులోనే ఉన్నాడు.

ఇదీ చదవండి : 'జమ్ముకశ్మీర్​లో రాజకీయ హత్యలకు కుట్ర'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.