ETV Bharat / bharat

'వారు పార్టీ వీడినా టీఎంసీకి నష్టమేం లేదు' - bengal elections

బంగాల్​లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ అధికార తృణమూల్​ కాంగ్రెస్​ను వదిలి కొందరు ముఖ్య నాయకులు భాజపాలోకి వలస వెళ్తున్నారు. అయితే ఇలాంటి చర్యలు ఏమీ వచ్చే ఎన్నికల్లో అధికార పక్షాన్ని ఇబ్బంది పెట్టలేవని అంటున్నారు ఆ రాష్ట్ర పంచాయతీరాజ్​ శాఖ మంత్రి సుబ్రతా ముఖర్జీ.

Defections will not have any impact on TMC's poll prospects: Bengal minister
'వెన్నుపోటుదారులు మా పార్టీని ఏం చేయలేరు'
author img

By

Published : Dec 20, 2020, 4:45 PM IST

పార్టీ ఫిరాయింపుల కారణంగా బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్​ కాంగ్రెస్​ విజయావకాశాలపై ఎటువంటి ప్రభావం ఉండదని ధీమా వ్యక్తంచేశారు ఆ రాష్ట్ర​ పంచాయతీరాజ్​ శాఖ మంత్రి సుబ్రతా ముఖర్జీ. అమిత్​ షా ఆధ్వర్యంలో శనివారం కొందరు అధికార పార్టీ నేతలు భాజపాలో చేరిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

పార్టీ ఫిరాయింపుదారుల విషయానికి తృణమూల్​ పెద్దగా ప్రాముఖ్యం ఇవ్వదని తెలిపారు ముఖర్జీ. 'వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 294 ఎమ్మెల్యే సీట్లకు గానూ.. 250 స్థానాల్లో భాజపా విజయం సాధిస్తోంది' అన్న అమిత్​ షా మాటలు బూటకమని అన్నారు.

"సువేందు అధికారి పార్టీ మారటం ఏమీ విస్మయానికి గురి చేయలేదు. ఆయన ముందు నుంచే భాజపాతో సన్నిహితంగా ఉండడం మాకు తెలుసు. ఇలాంటి వెన్నుపోటు చర్యలు తృణమూల్​ కాంగ్రెస్​ను ఇబ్బంది పెట్టలేవు. భాజపా నేతలు 250 స్థానాలు గెలుస్తామని బీరాలు పలుకుతున్నారు. ఫ్లెక్సీల విషయంలో భాజపా నాయకులు రవీంద్రనాథ్​ ఠాగూర్​ను అవమానించారు."

- సుబ్రతా ముఖర్జీ, పంచాయతీరాజ్​ శాఖా మంత్రి

ఇవీ చూడండి:

సువేందు రాజీనామా తిరస్కరణ

18న షా సమక్షంలో కమలం గూటికి సువేందు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.