Deceased Railway Employee Pension To Two Wives : మరణించిన రైల్వే ఉద్యోగికి ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలున్న సందర్భంలో వారందరికీ(భార్యలకు) పెన్షన్ డబ్బులు సమానంగా వస్తాయని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. రైల్వే నిబంధనల ప్రకారం ఇది సాధ్యపడుతుందని స్పష్టం చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్ ఎం.నాగప్రసన్న నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు సంబంధిత రైల్వే అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
"రైల్వే సర్వీస్ రూల్స్ ప్రకారం మరణించిన రైల్వే ఉద్యోగికి చెందిన భార్యలందరూ కుటుంబ పెన్షన్‌ను పొందేందుకు అర్హులు. దీనిని అందరూ సమానంగా పంచుకోవాలి."
- కర్ణాటక హైకోర్టు
ఇదీ కేసు
ఆర్.రమేశ్‌బాబు అనే వ్యక్తి ఇండియన్ రైల్వేస్‌కు చెందిన సౌత్‌వెస్ట్ రైల్వే సీనియర్ డివిజనల్ పర్సనల్ మేనేజర్ కార్యాలయంలో ట్రాఫిక్ విభాగంలో పాయింట్‌మెన్‌గా పనిచేసేవారు. ఈయనకు ఒక భార్య ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 1999 డిసెంబర్ 9న పుష్ప అనే మరో మహిళను తిరుపతిలో రెండో వివాహం చేసుకున్నారు. వీరికి 22 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. ఈ క్రమంలో ఉన్నట్టుండి బాబు 2021 మే 4న మృతి చెందారు. దీంతో ఆయన మొదటి భార్య- తనకు, తన పిల్లలకు రైల్వే నుంచి రావాల్సిన ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా పెన్షన్‌కూ అప్లై చేసుకున్నారు. మరణించిన భర్త ఉద్యోగాన్ని కారుణ్య నియామకం కింద తమ రెండో కుమార్తెకు ఇవ్వాలని రైల్వే అధికారులను అభ్యర్థించారు.
ఇదిలా ఉంటే రెండో భార్య కూడా తనకూ చనిపోయిన భర్త నుంచి రావాల్సిన ప్రయోజనాలు కల్పించాలని కోరుతూ కుటుంబ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో మొదటి భార్యకు అందాల్సిన పెన్షన్ సహా ఇతర బెనిఫిట్స్‌ను ఫ్యామిలీ కోర్టు ఆదేశాలు వచ్చాకే చెల్లిస్తామని పశ్చిమ రైల్వే బోర్డు అధికారులు స్పష్టం చేశారు. దీంతో మొదటి భార్య బెంగళూరులోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. తన భర్త ఉద్యోగంతో పాటు పెన్షన్ ఇతర ప్రయోజనాలు తనకు అందేలా పశ్చిమ రైల్వే బోర్డును ఆదేశించాలని కోరారు. చట్టబద్ధంగా అన్నీ హక్కులు మొదటి భార్య అయిన తనకే ఉంటాయని పేర్కొంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే వ్యవహారంపై అదే కుటుంబ కోర్టులో మెమో దాఖలు చేశారు రెండో భార్య.
వీటిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం పెన్షన్‌లో 50 శాతాన్ని మొదటి భార్యకు, ఆయన పిల్లలకు చెల్లించాలని 2022 జులై 22న పశ్చిమ రైల్వే బోర్డు అధికారులను ఆదేశించింది. మొదటి భార్య, ఆమె కుమార్తెలకు 50% పింఛను విడుదల చేయాలంటూ రైల్వే అధికారులను ఆదేశించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ రెండో భార్య కర్ణాటక హైకోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు మరణించిన ఉద్యోగి భార్యలకు సమానంగా పింఛన్‌ను పంపిణీ చేయాలని రైల్వే అధికారులకు స్పష్టం చేసింది. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
పదో తరగతి అర్హతతో బ్యాంక్ జాబ్స్- అప్లైకు లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
రిపబ్లిక్ డే వేడుకలకు చీఫ్ గెస్ట్‌గా మేక్రాన్! బైడెన్‌కు బదులుగా ఆయనే!!