ETV Bharat / bharat

టీఎంసీకి మరో ఎమ్మెల్యే రాజీనామా - తృణమూల్​ కాంగ్రెస్​

ఎన్నికల్లో టికెట్టు కేటాయించకపోవటాన్ని నిరసిస్తూ టీఎంసీకి రాజీనామా చేశారు ఆ పార్టీ ఎమ్మెల్యే దేబశ్రీ రాయ్​. మరోవైపు.. ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు భాజపాలో చేరారు.

Debashree Roy resigns from TMC
టీఎంసీకి ఎమ్మెల్యే దేబశ్రీ రాయ్​​ రాజీనామా
author img

By

Published : Mar 15, 2021, 4:38 PM IST

అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్టు ఇవ్వలేదనే కారణంగా.. ప్రముఖ నటి, తృణమూల్​ కాంగ్రెస్​ ఎమ్మెల్యే దేబశ్రీ రాయ్​.. పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు టీఎంసీ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్రతా బక్షీకి లేఖ పంపారు.

Debashree Roy resigns from TMC
ఎమ్మెల్యే దేబశ్రీ రాయ్​​ రాజీనామా లేఖ

" నేను పార్టీలో ఏ పదవిలోనూ లేకపోయినప్పటికీ.. పార్టీ నాయకత్వానికి సమాచారం అందించాల్సిన అవసరం ఉందని భావించి ఈ లేఖ రాస్తున్నా. టీఎంసీతో ఎలాంటి సంబంధం కలిగి ఉండకూడదని నిర్ణయించుకున్నా. "

- దేబశ్రీ రాయ్​, టీఎంసీ ఎమ్మెల్యే

భవిష్యత్తు ప్రణాళికపై ప్రశ్నించగా.. ప్రస్తుతానికి తాను నటనపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు రాయ్​. అయితే.. బలమైన ప్రతిపాదన వస్తే ఏదైనా పార్టీలో చేరేందుకు సిద్ధమేనని ప్రకటించారు.

2019లోనే భాజపాలో చేరేందుకు సిద్ధమయ్యారు రాయ్​. అయితే.. అప్పటికే టీఎంసీ నుంచి భాజపాలోకి వెళ్లిన కోల్​కతా మాజీ మేయర్​ సోవన్​ ఛటర్జీ, ఆయన స్నేహితుడు బైసాఖి బందోపధ్యాయ్​ ఆమె కమలదళంలోకి రావడాన్ని వ్యతిరేకించారు. యాదృచ్ఛికంగా.. తనకు టికెట్టు దక్కలేదనే కారణంతో ఇటీవలే భాజపాకు రాజీనామా చేశారు ఛటర్జీ.

భాజపాలోకి పలువురు నేతలు..

హల్దియా మున్సిపాలిటీ మాజీ ఛైర్మన్​ శ్యామల్​ కుమార్​ అదక్​, టీఎంసీ కౌన్సిలర్​ స్వపన్​ దాస్​, సుప్రియా మైతి, ఇతర నేతలు భాజపాలో చేశారు. కోల్​కతాలో జరిగిన కార్యక్రమంలో భాజపా నేత ముకుల్​ రాయ్​ సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.

Debashree Roy resigns from TMC
భాజపాలోకి టీఎంసీ నేతలు

ఇదీ చూడండి: కుట్రలతో నన్ను అడ్డుకోలేరు: మమత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.