ETV Bharat / bharat

కల్తీ మద్యం ఘటనలో 33కు పెరిగిన మృతులు! - Poisonous Liquor

బిహార్​లో కల్తీ మద్యం(Poisonous Liquor ) తాగి మరణించినవారి సంఖ్య 33కు పెరిగింది. గోపాల్​పుర్​ జిల్లాలో 18 మంది, పశ్చిమ చంపారన్ జిల్లాలో 15 మంది ఇప్పటివరకు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. అలాగే పలు చోట్ల సోదాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.

Poisonous Liquor
కల్తీ మద్యం ఘటన
author img

By

Published : Nov 5, 2021, 2:21 PM IST

బిహార్​లో కల్తీ మద్యం(Poisonous Liquor) ఘటనలో మృతుల సంఖ్య(illicit liquor death) రోజురోజుకు పెరుగుతోంది. శుక్రవారం నాటికి ఆ సంఖ్య 33కు చేరింది. గోపాల్‌గంజ్​ జిల్లాలోని మహ్మద్‌పుర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో 18 మంది చనిపోగా.. పశ్చిమ చంపారన్ జిల్లాలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.

కల్తీ మద్యం (Poisonous Liquor) విక్రయాలను అరికట్టడంలో విఫలమైన మహ్మద్​పుర్​ పోలీస్ స్టేషన్​ హౌస్​ ఆఫీసర్​​ను అధికారులు సస్పెండ్​ చేశారు.

మరోవైపు.. వేర్వేరు ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఓ ఇంట్లో 6 మద్యం ప్యాకెట్లు, మరో ఇంట్లో 24 స్పిరిట్​ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మద్యంలో విష పదార్థాలను గుర్తించడానికి పరీక్షకు పంపినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసినట్లు సబ్​ డివిజనల్​ పోలీసు అధికారి సంజీవ్​ కుమార్​ తెలిపారు.

ఇదీ చూడండి: రెండు రోజుల్లో 24 మంది మృతి- కల్తీ మద్యమే కారణం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.