దేశంలో ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో ఏప్రిల్ నుంచి జూన్ మధ్య పగటి ఉష్ణోగ్రతలు సాధారణ గరిష్ఠం కన్నా ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర, వాయువ్య, మధ్య తూర్పు ప్రాంతాల్లో ఈ ప్రభావం ఉంటుందని స్పష్టం చేసింది.
అయితే దక్షిణ భారతదేశం సహా ఈశాన్య ప్రాంతాల్లో ఉష్ణోగ్రత సాధారణ గరిష్ఠం కన్నా తక్కువ ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటుతున్నాయి.
ఇదీ చదవండి : 'ఆ పేలుడు పదార్థాలు కొన్నది సచిన్ వాజేనే'