Daughter killed mother: ఓ 14 బాలిక ఫ్రయింగ్ ప్యాన్‌తో కొట్టటం వల్ల ఆమె తల్లి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్, నొయిడాలోని సెక్టార్-77 అంతరిక్ష కెన్వాల్ సొసైటీలో జరిగింది.
ఇదీ జరిగింది..
నొయిడాలోని శాహదరా ప్రాంతానికి చెందిన అనురాధ అనే మహిళకు 16 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఐదేళ్ల తర్వాత భర్తతో విడిపోయి కుమార్తెతో పాటు.. నొయిడాలో నివాసం ఉంటోంది.
తల్లీకూతుళ్ల మధ్య మంగళవారం వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన 14 ఏళ్ల బాలిక తల్లి తలపై ఫ్రయింగ్ ప్యాన్‌తో బలంగా కొట్టింది. తీవ్ర గాయాలైన అనురాధ స్పృహ కోల్పోయింది. గమనించిన స్థానికులు హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. స్థానికులను అడిగి తెలుసుకున్నారు. తన మేనకోడలు కొట్టడం ద్వారా అనురాధ చనిపోయినట్లు ఆమె తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు.
"బాధితురాలు అనురాధ తన కూతురితో కలిసి ఫ్లాట్‌లో నివసిస్తోంది. ఇరువురి మధ్య కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతోంది. కూతురిని తిడుతూ, కొడుతూ ఉండేది. ఆమె ప్రవర్తన సైతం సరిగా ఉండేది కాదు. దీంతో ఆగ్రహానికి లోనైన బాలిక వంటపాత్రతో కొట్టింది. తీవ్ర గాయాలతో అనురాధ మృతి చెందింది. బాలికను కస్టడీలోకి తీసుకుని బాలనేరస్థుల కేంద్రానికి తరలించాం."
- రణ్విజయ్ సింగ్, నోయిడా అదనపు డీసీపీ
ఇదీ చూడండి: ఆన్లైన్ గేమ్స్‌కు బానిస- అప్పులు కట్టలేక ఆత్మహత్య