ETV Bharat / bharat

'మావోయిస్టులూ లొంగిపోండి.. కరోనా చికిత్స అందిస్తాం'

author img

By

Published : May 9, 2021, 10:07 AM IST

Updated : May 9, 2021, 11:27 AM IST

మావోయిస్టు అగ్రనేతలు కరోనా బారిన పడినట్లు సమాచారం అందిందని తెలిపారు దంతెవాడ ఎస్​పీ అభిషేక్​ పల్లవ్​. కొవిడ్​ బాధిత మావోయిస్టులు లొంగిపోతే ఉచితంగా తగిన వైద్య సాయం అందిస్తామని పేర్కొన్నారు.

Maoists
'మీరు లొంగిపోతే కరోనా చిక్సిత ఫ్రీ..'

దండకారణ్య ప్రాంతంలోని బీజాపూర్‌, దంతెవాడ, సుక్మా జిల్లాల్లో దాదాపు 100మంది మావోయిస్టులు కరోనా బారిన పడినట్లు పోలీస్‌ ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. వీరిలో సుజాత అనే మహిళా మావోయిస్టు నేతకు కొవిడ్‌ సోకినట్లు పోలీస్‌ అధికారులకు సమాచారం అందింది. ఈమెపై సుమారు రూ.25 లక్షల రివార్డు ఉన్నట్లు సమాచారం. మరో ఇద్దరు మావోయిస్టు అగ్ర నేతలైన దినేష్‌, జయలాల్‌ కూడా కరోనా బారిన పడినట్లు తెలిసింది. ఒక్కొక్కరిపై సుమారు రూ.10లక్షల చొప్పున నగదు రివార్డు ఉంది.

'మీ ద్వారా గ్రామాలకు నష్టం...'

కరోనా బాధిత మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోతే తగిన వైద్య సహాయం అందజేస్తామని దంతెవాడ జిల్లా ఎస్​పీ అభిషేక్‌ పల్లవ్‌ వెల్లడించారు. కరోనా బారిన పడిన మావోయిస్టులు.. చికిత్స తీసుకోకుండా తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారని అన్నారు. సరైన సమయంలో వారు చిక్సిత తీసుకోకపోతే వైరస్​ సంక్రమణ ద్వారా గ్రామాలకు విస్తరిస్తుందని హెచ్చరించారు.

ఇదీ చూడండి: సాధువులు, ఖైదీలు, యాచకులందరికీ వ్యాక్సిన్‌!

Last Updated : May 9, 2021, 11:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.