ETV Bharat / bharat

దళిత మహిళపై రేప్​.. అనంతరం నిప్పంటించి హత్య.. మరో యువతి గొంతు కోసి.. - ప్రియురాలి గొంతు కోసిన ప్రియుడు

దళిత మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. అనంతరం ఆమెపై రసాయనాలు పోసి పరారయ్యాడు. దీంతో బాధితురాలు మరణించింది. ఈ ఘటన రాజస్థాన్​లో జరిగింది. మరోవైపు.. భర్తను హతమార్చింది ఓ భార్య. ఈ దారుణం కేరళలో వెలుగుచూసింది.

dalit woman rape and poured
dalit woman rape and poured
author img

By

Published : Apr 8, 2023, 1:52 PM IST

రాజస్థాన్​లో దారుణం జరిగింది. దళిత మహిళపై అత్యాచారం చేశాడు ఓ కామాంధుడు. అనంతరం ఆమెపై రసాయనాలు పోసి నిప్పంటించాడు. దీంతో హుటాహుటిన బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. 40 శాతం కాలిన గాయాలైన బాధితురాలు జోధ్​పుర్​లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించింది. నిందితుడు షకూర్​ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు బాధితురాలి ఇంటి సమీపంలోనే నివసిస్తున్నట్లు తెలిపారు. బాధితురాలిపై గురువారం అత్యాచారం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.

"బాధితురాలు ఇంట్లోకి నిందితుడు ప్రవేశించాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెపై ఘాటైన రసాయనం పోసి నిప్పంటించాడు. బాధితురాలి కేకలు విన్న ఆమె సోదరి వెంటనే ఘటనాస్థలికి వచ్చింది. నిందితుడు ఆమెను పక్కకు నెట్టేసి.. అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఆమెను మొదట బలోత్రాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెకు మెరుగైన వైద్య చికిత్స కోసం అక్కడి వైద్యులు జోధ్​పుర్ ప్రభుత్వ ఆస్పత్రికి సిఫార్సు చేశారు. అక్కడే బాధితురాలు కాలిన గాయాలతో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించింది."

--పోలీసులు

బాధితురాలు మృతిపై స్థానికులు, ఆమె బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జోధ్​పుర్​లోని మహాత్మా గాంధీ ఆస్పత్రి ఆవరణలో నిరసనలు చేపట్టారు. బాధితురాలి కుటుంబానికి రూ.కోటి పరిహారం, ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చేవరకు మృతదేహానికి పోస్టుమార్టం పరీక్షలు చేయనివ్వమని అన్నారు.

దళిత యువతి హత్య..
ఉత్తర్​ప్రదేశ్​ అమేఠీలో దారుణం జరిగింది. 18 ఏళ్ల దళిత యువతిని కత్తితో గొంతు కోసి చంపాడో యువకుడు. అనంతరం తానూ కత్తితో దాడి చేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్రంగా గాయపడిన నిందితుడు సంజయ్ కుమార్​(23)ను లఖ్​నవూలో ఓ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. యువతి తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో నిందితుడు ఇలా చేసినట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు. బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.

భర్తను హతమార్చిన భార్య..
కేరళలోని కాసర్​గోడ్​లో దారుణం జరిగింది. మద్యం మత్తులో భార్యతో గొడవ పడ్డాడు ఓ వ్యక్తి. దీంతో ఆగ్రహించిన భార్య.. భర్తను కత్తితో దాడి చేసి హతమార్చింది. నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. మృతుడు బాబు వర్గీస్​(54) మృతదేహాన్ని కన్నూర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం పోలీసులు తరలించారు. దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.