ETV Bharat / bharat

గ్రీజు అంటిందని అరాచకం.. దళితుడి ముఖం, శరీరంపై మలం పూసి.. - మధ్యప్రదేశ్​ దళితుడిపై మలం పూసిన వ్యక్తి

Dalit Man Face Smeared With Human Excreta : పొరపాటున గ్రీజు అంటించినందుకు ఒక దళితుడి ముఖం, శరీరంపై మలం పూశాడు ఓ వ్యక్తి. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అసలు ఏం జరిగిందంటే?

Dalit Man Face Smeared With Human Excreta :

author img

By

Published : Jul 23, 2023, 1:27 PM IST

Updated : Jul 23, 2023, 3:35 PM IST

Dalit Man Face Smeared With Human Excreta : పొరపాటున గ్రీజు అంటించడం వల్ల.. మరో కులానికి చెందిన వ్యక్తి తన ముఖం, శరీరంపై మలం పూశాడని ఓ దళిత వ్యక్తి సంచలన ఆరోపణ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడిని శనివారం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన మధ్యప్రదేశ్​ ఛతర్​పుర్ జిల్లాలోని బికౌరా గ్రామంలో జరిగింది.

ఇదీ జరిగింది..
ఛతర్​పుర్​ జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న బికౌర గ్రామంలో డ్రైనేజీ నిర్మించే పనికి దశరథ్​ అహిర్వార్​ అనే దళిత వ్యక్తి వెళ్లాడు. ఆ డ్రైనేజీ సమీపంలో ఉన్న చేతి పంపు వద్ద రాంకృపాల్​ పటేల్​ అనే వ్యక్తి స్నానం చేస్తున్నాడు. అహిర్వార్​ చేతికి ఉన్న గ్రీజు రాంకృపాల్​కు అంటింది. దీంతో కోపోద్రిక్తుడైన నిందితుడు రాంకృపాల్​.. తాను స్నానం చేస్తున్న మగ్గుతో.. సమీపంలో ఉన్న మలాన్ని తీసుకువచ్చి.. దశరథ్ అహిర్వార్​​ తల, ముఖం, శరీరంపై పూశాడు. అక్కడితో ఆగకుండా.. కులం పేరుతో దూషించాడు. ఈ విషయాన్ని గ్రామ పంచాయితీ దృష్టికి తీసుకెళ్తే.. తిరిగి బాధితుడిపైనే రూ. 600 జరిమానా విధించారు. ఈ మేరకు బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై స్పందించిన ఎస్​డీఓపీ మన్​మోహన్​ సింగ్​ భగేల్​.. నిందితుడిపై ఎస్​సీ/ ఎస్​టీ చట్టంతో పాటు పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు. అయితే, రాంకృపాల్​, దశరథ్​.. ఇద్దరు ఒకరిపై ఒకరు సరదాగా వస్తువులు విసిరేసుకున్నారని.. తర్వాత అహిర్వార్​ గ్రీజు రాంకృపాల్​కు పూశాడని చెప్పారు. అనంతరం చేత్తో మలాన్ని తీసి​.. అహిర్వార్​పై పూశాడని తెలిపారు. అహిర్వార్​ శనివారం ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. అయితే, పంచాయితీకి ఫిర్యాదు చేసిన విషయంలో అహిర్వార్​ను ఆరా తీయగా.. సమాధానం చెప్పలేదన్నారు. ఇద్దరు వ్యక్తుల వయసు 40 నుంచి 45 మధ్య ఉంటుందని తెలిపారు.

గిరిజనుడిపై మూత్ర విసర్జన..
మధ్యప్రదేశ్​లోని సీధీ జిల్లాలో దాదాపు 3 నెలల క్రితం ఆదివాసీ యువకుడు దశరథ్ రావత్​పై ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తి మూత్రం పోయగా.. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ఇటీవల వైరల్‌ కావడం వల్ల మధ్యప్రదేశ్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. దీంతో ప్రవేశ్‌ శుక్లాను అరెస్టు చేసి.. జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అతడి ఇంటిని కూడా బుల్డోజర్‌తో నేలమట్టం చేశారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ విచారం వ్యక్తం చేశారు. రాజధాని భోపాల్​లోని తన నివాసానికి బాధితుడ్ని పిలిపించుకుని కాళ్లు కడిగి క్షమాపణ కోరారు. బాధితుడు దశరథ్ రావత్​ను కుర్చీపై కూర్చోబెట్టి, తాను కిందే కూర్చోని.. నీళ్లతో అతడి కాళ్లు కడిగారు. దశరథ్ రావత్​ను సన్మానించి, స్నేహితుడిగా సంభోదిస్తూ.. సరదాగా కాసేపు ముచ్చటించారు. ఈ వీడియో చూడాలంటే ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

Last Updated : Jul 23, 2023, 3:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.