ETV Bharat / bharat

గుజరాత్​లో 'తౌక్టే' ధాటికి 53 మంది మృతి - తౌక్టే తుపాను ప్రభావం

గుజరాత్​లో తౌక్టే తుపాను వల్ల మొత్తం 53 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. ఇందులో ఎక్కువ మంది గోడ కూలడం వంటి ఘటనల వల్లే మరణించారని చెప్పారు.

Cyclone Tauktae
గుజరాత్​లో తౌక్టే
author img

By

Published : May 20, 2021, 2:10 PM IST

గుజరాత్​లో తౌక్టే తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను వల్ల ఆ రాష్ట్రంలో మొత్తం 53 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు గురువారం తెలిపారు. ఇందులో ఎక్కువ మరణాలు.. గోడలు కూలడం వంటి ఘటనల వల్లే జరిగాయని చెప్పారు.

"తాజాగా లభ్యమైన సమాచారం ప్రకారం.. తౌక్టే తుపాను కారణంగా గుజరాత్​ వ్యాప్తంగా 53 మంది ప్రాణాలు కోల్పోయారు."

-హర్షద్​ పటేల్​, గుజరాత్​ విపత్తు నిర్వహణ అధికారి

అతిభీకర తుపానుగా రూపాంతరం చెందిన తౌక్టే.. సోమవారం అర్ధరాత్రి తర్వాత గుజరాత్​లోని దీవ్, ఉనాల మధ్య తీరం దాటింది. ఇది మరింత బలహీనపడి వాయుగుండంగా మారిందని అధికారులు తెలిపారు. కాగా.. గుజరాత్​లోని తుపాను ప్రభావిత జిల్లాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. బుధవారం ఏరియల్​ సర్వే నిర్వహించారు. తక్షణ సాయం కింద రూ.1,000 కోట్లు ప్రకటించారు.

అనంతరం.. తుపాను ధాటికి మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారాన్ని గుజరాత్​ ప్రభుత్వం ప్రకటించింది. క్షతగాత్రులకు రూ.50,000 అందించనున్నట్లు తెలిపింది. ఇది కేంద్ర ప్రభుత్వం అందించే సాయానికి అదనం అని ఆ రాష్ట్ర సీఎం విజయ్ రూపానీ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: 'దేశాల మధ్య పరస్పర సహకారం అవసరం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.