ETV Bharat / bharat

అతితీవ్ర తుపానుగా తౌక్టే- 'మహా'లో విధ్వంసం - cyclonic storm

తౌక్టే తుపాను బీభత్సం సృష్టిస్తోంది. మహారాష్ట్ర, గుజరాత్​ సహా పలు తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబయిలో రెండు వ్యాపారనౌకలు కొట్టుకుపోయాయి. వీటిలో మొత్తం 410 మంది ఉన్నట్లు సమాచారం. సిబ్బందిని కాపాడేందుకు యుద్ధనౌకలతో రంగంలోకి దిగింది నౌకాదళం. సాయంత్రం 5.30- 8.30 గంటల మధ్య తుపాను గుజరాత్​ తీరాన్ని తాకనుంది.

Cyclone Tauktae
అతితీవ్ర తుపానుగా తౌక్టే
author img

By

Published : May 17, 2021, 4:30 PM IST

అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుపాన్‌.. అతి తీవ్ర తుపాన్‌గా మారింది. ముంబయికి 150 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైన తుపాను.. పశ్చిమ వాయవ్య దిశగా గంటకు 20 కి.మీ. వేగంతో పయనిస్తోంది. సాయంత్రం 5.30- 8.30 గంటల మధ్య గుజరాత్​ తీరాన్ని తాకి.. రాత్రి 8-11 గంటల సమయంలో పోరుబందర్​- మహువా మధ్యలో తీవ్రత తగ్గి తీరం దాటనుంది.

తుపాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురు గాలులు వీస్తున్నాయి.

రెండు నౌకల్లో 410 మంది..

ముంబయి పశ్చిమ తీరాన ఉన్న చమురు కేంద్రాల్లోని రెండు వ్యాపారనౌకలు కొట్టుకుపోయాయి.

  • పీ305 అనే నౌకలో 273 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. దీని కోసం.. ఐఎన్​ఎస్​ కొచ్చి యుద్ధనౌకతో గాలింపు చర్యలు చేపట్టింది నౌకా దళం.
  • జీఏఎల్​ కన్​స్ట్రక్టర్​ అనే మరో నౌక కూడా కొట్టుకుపోయినట్లు సమాచారం అందింది. దీంట్లో 137 మంది ఉన్నారు. ఇక్కడ ఐఎన్​ఎస్​ కోల్​కతా యుద్ధనౌక రంగంలోకి దిగింది.
  • తౌక్టే కారణంగా రాయ్​గఢ్​ జిల్లాలో రెడ్​ అలర్ట్​, ముంబయిలో ఆరెంజ్​ అలర్ట్​ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక్కడ భారీ వర్షాలు, భీకర గాలులు హడలెత్తిస్తున్నాయి.
  • కొంకణ్​ ఆనంద్​ వాడీ ఓడరేవు వద్ద పడవ మునగగా.. ఒక నావికుడు చనిపోయాడు. మరో ముగ్గురి ఆచూకీ తెలియలేదు.
  • వర్షాలు కారణంగా మరొకరు ప్రాణాలు కోల్పోయారు.

మహా సీఎంకు మోదీ ఫోన్​..

తౌక్టే తుపాను సన్నద్ధతపై.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రేతో ఫోన్​లో మాట్లాడారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. రాష్ట్రంలో పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.

  • కేరళలో సముద్రం అల్లకల్లోలంగా మారి.. కెరటాలు ఎగసిపడుతున్నాయి. 9 జిల్లాల్లో తుపాను తీవ్రత అధికంగా ఉంది. పలు ప్రాంతాల్లో ఇళ్లు ధ్వంసమయ్యాయి.
  • కర్ణాటకలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో విద్యుత్​ వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలిగింది. 121 గ్రామాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇక్కడి తీర ప్రాంతాల్లో మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం 300కుపైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి.

ఇదీ చూడండి: మరుగుజ్జు వెదురుతో సామాన్యుడి లాభాల పంట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.