ETV Bharat / bharat

తీరాన్ని తాకిన బిపోర్​జాయ్​ తుఫాన్..​ ఎగిరిపడ్డ 100 ఇళ్ల పైకప్పులు!.. పలువురికి గాయాలు

Cyclone Biparjoy Landfall Live Updates
Cyclone Biparjoy Landfall Live Updates
author img

By

Published : Jun 15, 2023, 6:08 PM IST

Updated : Jun 15, 2023, 10:03 PM IST

22:02 June 15

Biparjoy Cyclone Landfall Live Updates
బిపోర్​జాయ్​ తుఫాన్​ బీభత్సం

22:02 June 15

Biparjoy Cyclone Landfall Live Updates
బిపోర్​జాయ్​ తుఫాన్​ బీభత్సం

20:45 June 15

బలమైన గాలుల కారణంగా ద్వారకా జిల్లాలో చెట్లు, హోర్డింగ్‌లు నేలకూలాయి. తుఫాన్​ ప్రభావం ప్రధానంగా గుజరాత్​లోని కచ్​, దక్షిణ రాజస్థాన్​ ప్రాంతాల్లో ఉంటుందని ఎన్​డీఆర్ఎఫ్​ ఐజీ నరేంద్ర సింగ్​ బుందేలా తెలిపారు. తుఫాన్ కారణంగా భారీ వర్షాలు, వరదలు వచ్చే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు.

19:36 June 15

Biparjoy Cyclone Live News : తీరం తాకిన తర్వాత బిపోర్​జాయ్​ తుఫాన్​ ఉద్ధృతి పెరిగింది. రాకాసి గాలుల బీభత్సానికి అమ్రేలిలోని మోరంగిలో 100 ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. ఈ పైకప్పులు పడడం వల్ల పలువురు గాయపడ్డారు. మరోవైపు.. బిపోర్​జాయ్ తుఫాన్ బీభత్సం నేపథ్యంలో​ నవ్​సారి జిల్లాలోని అన్ని పాఠశాలలకు జూన్​16న సెలవు ప్రకటించారు ఆ జిల్లా కలెక్టర్​.

18:44 June 15

రాకాసి గాలుల బీభత్సం.. ఎగిరిపోయిన 100 ఇళ్ల పైకప్పులు.. పలువురికి గాయాలు

Biparjoy Cyclone Landfall Live Updates : బిపోర్​జాయ్​ తుఫాన్​ తీరం దాటే ప్రక్రియ గుజరాత్​లోని సౌరాష్ట్ర, కచ్​ ప్రాంతాల్లో మొదలైంది. ఇది అర్ధరాత్రి వరకు సాగనుందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్ గుజరాత్‌ తీరాన్ని తాకడం వల్ల.. మాండ్విలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. భుజ్‌లో బలమైన గాలులతోపాటు భారీ వాన పడుతోంది. దేవభూమి ద్వారక, జామ్ నగర్‌లో తుఫాన్ ప్రభావం కనిపిస్తోంది. దామన్ ప్రాంతంలో సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా ఉంది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి.

17:12 June 15

అల్లకల్లోలంగా సముద్రం.. రాత్రికి​ తీరం దాటనున్న బిపోర్​జాయ్ తుఫాన్

Cyclone Biporjoy Status Live : అత్యంత తీవ్ర బిపోర్‌ జాయ్‌ తుఫాన్ గుజరాత్‌ తీరం వైపు దూసుకొస్తోంది. ఈ రాత్రికి తీరం దాటనుందని అధికారులు తెలిపారు. అయితే, తొలుత ఈ సాయంత్రం తుఫాన్ తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేసినా.. తుఫాన్ వేగం తగ్గటం వల్ల ఆలస్యమవుతున్నట్లు అధికారులు వెల్లడించారు. కచ్ జిల్లాలోని జఖౌ ఓడరేవు సమీపంలో.. మాండ్వి పాకిస్థాన్​లోని కరాచీ మధ్య ఈ రాత్రికి తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం దామన్ ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో తుఫాన్ బీభత్సం మొదలైంది. కచ్‌సహా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
తుఫాన్ భారీ విధ్వంసం సృష్టించనుందన్న సమాచారంతో.. సముద్ర తీరం కలిగిన 8 జిల్లాల్లోని 94,427 మందిని తాత్కాలిక శిబిరాలకు తరలించారు. ఈ ఎనిమిది జిల్లాల్లోని తుఫాన్ ప్రభావిత ప్రజల కోసం 1,521 శిబిరాలను ఏర్పాటు చేశారు. వైద్య బృందాలు తరచుగా ఈ శిబిరాలను సందర్శిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

రాత్రికి తీరం దాటే అవకాశం..
Cyclone Biporjoy Areas Affected : బిపోర్‌ జాయ్‌ తుఫాన్ జఖౌ ఓడరేవు సమీపంలో.. రాత్రి 9నుంచి 10గంటల ప్రాంతంలో తీరం దాటనున్నట్లు.. ఆ ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ సమయంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలలు రెండు మూడు మీటర్ల ఎత్తులో ఎగిసిపడుతాయని, ఫలితంగా కచ్, దేవభూమి ద్వారక, పోరుబందర్, జామ్ నగర్, మోర్బీ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ సందర్భంగా దాదాపు గంటకు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.

తీరానికి 80 కిలోమీటర్ల దూరంలో..
Cyclone Biporjoy Route : "బిపోర్‌జాయ్‌ తుఫాన్ అరేబియా సముద్రానికి ఈశాన్య దిశలో కేంద్రీకృతమైంది. సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో జఖౌ ఓడరేవుకు నైరుతి దిశలో 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది అత్యంత తీవ్ర తుఫాన్. గాలులు గంటకు 120 నుంచి 230 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. తుఫాన్ ఈశాన్య దిశగా కదులుతోంది. సాయంత్రం నుంచి రాత్రి మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నాం. జఖౌ ఓడరేవుకు సమీపంలో మాండ్వి-కరాచీ మధ్య తీరం దాటుతుంది. ప్రస్తుతం ఈ తుఫాన్ గంటకు 10కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. తుఫాన్ వేగం క్రమంగా గంటకు 14 నుంచి 15 కిలోమీటర్లకు పెరగనుంది" అని కేంద్ర వాతావరణ విభాగం తెలిపింది.

తూపాను విధ్వంసం.. సర్వం సిద్ధం..
గాంధీనగర్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్ర అత్యవసర కార్యకలాపాల కేంద్రాన్ని.. గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌.. ఈ ఉదయం సందర్శించారు. ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ప్రజలకు అందుతున్న సహాయ చర్యలపైనా ఆరా తీశారు. కేంద్ర వాతావరణ విభాగం అంచనా ప్రకారం.. తుఫాన్ వేగం తగ్గినట్లు అధికారులు సీఎం భూపేంద్ర పటేల్‌కు తెలిపారు.
తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా.. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. స్తంభాలు విరిగిపడి విద్యుత్తు సరఫరా నిలిచిపోతే.. తాగునీటి సరఫరా అంతరాయం లేకుండా జనరేటర్లను ఏర్పాటు చేశారు. 25 జనరేటర్లను కచ్‌, ద్వారక, జామ్‌నగర్‌లో, మరో ఐదు మోర్బీలో సిద్ధంగా ఉంచారు.

అత్యవసర బలగాల మోహరింపు..
అత్యంత తీవ్ర తుఫాన్ బిపోర్‌జాయ్‌ భారీ విధ్వంసం సృష్టించనుందన్న సమాచారం మేరకు.. 18 NDRF, 12 SDRF, రోడ్లు, భవనాలు, తాగునీరు, విద్యుత్తు విభాగంతోపాటు సైన్యం, నౌకాదళం, వాయుసేన, తీరప్రాంత గస్తీ దళంతోపాటు BSF బృందాలను తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో మోహరించారు. తూర్పు, ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు చెందిన మరో 15 NDRF బృందాలను ఆకాశమార్గం ద్వారా తరలించేందుకు సిద్ధంగా ఉంచినట్లు NDRF చీఫ్‌ తెలిపారు. గుజరాత్‌, మహారాష్ట్రలో సహాయ, పునరావాస కార్యక్రమాల కోసం 33 బృందాలను మోహరించినట్లు చెప్పారు.

Last Updated : Jun 15, 2023, 10:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.