ETV Bharat / bharat

Cyber Attack On Supreme Court : సుప్రీంకోర్టు వెబ్​సైట్​పై సైబర్​ దాడి! అలా చేయొద్దని యూజర్లకు హెచ్చరిక

Cyber Attack On Supreme Court Phishing : సుప్రీం కోర్టు వెబ్​సైట్​పై సైబర్​ దాడి జరిగిందని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. అచ్చం అలాంటి నకిలీ వెబ్​సైట్​ సృష్టించి.. యూజర్ల వ్యక్తిగత డేటాను చోరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. అందుకే యూజర్లు అలాంటి సైట్​లతో ఎలాంటి సమాచారం పంచుకోవద్దని హెచ్చరిస్తూ అడ్వైజరీ జారీచేసింది.

Cyber Attack On Supreme Court Phishing
Cyber Attack On Supreme Court Phishing
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 31, 2023, 10:53 AM IST

Updated : Aug 31, 2023, 1:22 PM IST

Cyber Attack On Supreme Court Phishing : సుప్రీం కోర్టు వెబ్​సైట్​పై ఫిషింగ్​ (సైబర్ అటాక్) దాడి జరిగిందని పేర్కొంటూ అత్యున్నత న్యాయస్థానం గురువారం ఓ సర్క్యూలర్ జారీ చేసింది. అచ్చం రిజిస్ట్రీ వెబ్​సైట్​ లాంటి డొమైన్​తో ఉన్న ఫేక్​ వెబ్​సైట్​ క్రియేట్ చేశారని.. దాని ద్వారా యూజర్ల వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని అడుగుతున్నారని తెలిపింది. అలాంటి యూఆర్​ఎల్​ ( యూనిఫామ్ రిసోర్స్​ లొకేటర్- సైట్ అడ్రస్) ఉన్న వెబ్​సైట్​లో తమ వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని పంచుకోవద్దని అడ్వైజరీ జారీ చేసింది. అలా పంచుకుంటే వ్యక్తిగత డేటాను సైబర్​ నేరస్థులు చోరీ చేసే అవకాశం ఉందని హెచ్చరించింది.

Supreme Court Website Cyber Attack : అనుమానాస్పద లింక్​లపై క్లిక్ చేయొద్దని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. అసలైన వెబ్​సైట్ అని​ ధ్రువీకరించుకున్నాకే అందులోకి వెళ్లాలని చెప్పింది. కాగా, సుప్రీంకోర్టు రిజిస్ట్రీ.. వ్యక్తిగత సమాచారం, ఆర్థిక వివరాలు లేదా ఇతర రహస్య సమాచారాన్ని ఎప్పుడూ అడగదని అడ్వైజరీలో పేర్కొంది. అయితే, అపెక్స్​కోర్టుకు.. రిజిస్టర్​ అయిన www.sci.gov.in అనే డొమైన్ ఉందని చెప్పింది. వెబ్​సైట్​ లింక్​పై క్లిక్​ చేసేటప్పుచు యూఆర్​ఎల్​ను సరిచూసుకోవాలని తెలిపింది.

నకిలీ వెబ్​సైట్​ గురించి న్యాయవాదులు, పిటిషనర్లు జాగ్రత్తగా ఉంటాలని ఆర్టికల్​ 370పై విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ హెచ్చరించారు. దీంతో పాటు ఎవరైనా ఫిషింగ్​ సైబర్​ దాడికి గురైతే.. అన్ని ఆన్​లైన్ బ్యాంకు​ ఖాతాల పాస్​వర్డ్​లను మార్చాలని సూచించింది. సంబంధిత క్రెడిట్​ కార్డ్​ కంపెనీని, బ్యాంకులను సంప్రదించాలని తెలిపింది. ఈ ఫిషింగ్​ దాడిపై సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తదిన చర్యలు తీసుకుందని.. ఈ ఘటనపై విచారణ జరిపి నిందితులను కోర్టు ముందుకు తీసుకురావడానికి దర్యాప్తు సంస్థలకు ఆదేశించిందని వెల్లడించింది.

2000 భారత వెబ్​సైట్లపై సైబర్​ దాడి.. వారి పనే!​
గతేడాది భారత్​పై సైబర్​ దాడికి సంబంధించి 2000 వెబ్​సైట్​లను సైబర్​ కేటుగాళ్లు హ్యాక్​ చేశారు. అయితే అప్పట్లో బీజేపీ నేత నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా మలేసియా, ఇండోనేసియా సైబర్​ నేరగాళ్లు ఈ దాడులు చేశారని గుజరాత్​ పోలీసులు వెల్లిడించారు. పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

గల్వాన్ ఘర్షణ తర్వాతే చైనా సైబర్​ దాడులు- నిజం ఏంటి?

భారత నౌకాశ్రయంపై సైబర్‌దాడి యత్నాల్లో చైనా!

Last Updated : Aug 31, 2023, 1:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.