ETV Bharat / bharat

'హత్య' కేసులో మాజీ మంత్రి కుమార్తె పరార్​.. రేప్​ కేసులో మంత్రి కుమారుడు... - దిల్లీ పోలీసులు

lift accident death in Tamil Nadu: లిఫ్ట్​ ప్రమాదంలో బాలిక మృతి చెందిన కేసులో తమిళనాడు మాజీ మంత్రి కుమార్తెపై కేసు నమోదు కాగా.. ఆమె పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. మరోవైపు.. 23 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న కేసులో రాజస్థాన్​ మంత్రి కుమారుడిని అరెస్ట్​ చేసేందుకు జైపుర్​ వెళ్లారు దిల్లీ పోలీసులు.

lift accident death in Tamil Nadu
'హత్య' నేరంలో మాజీ మంత్రి కుమార్తె పరార్
author img

By

Published : May 15, 2022, 12:56 PM IST

lift accident death in Tamil Nadu: లిఫ్ట్​ ప్రమాదంలో ఇంటర్​ మొదటి సంవత్సరం విద్యార్థిని మృతిపై కేసు నమోదైన క్రమంలో అన్నాడీఎంకే నేత, తమిళనాడు మాజీ మంత్రి డీ జయకుమార్​ కుమార్తె జయప్రియ అజ్ఞాతంలోకి వెళ్లారు. జయప్రియకు చెందిన ఫంక్షన్​ హాల్​లో రెండు రోజుల క్రితం లిఫ్ట్​లో ఇరుకుని విద్యార్థిని మృతి చెందింది. దీంతో జయప్రియపై కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం నిందితురాలి కోసం గాలిస్తున్నామని, త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

తిరువళ్లూర్​ జిల్లాలోని గుమ్మిడిపూడిలో ఉన్న మ్యారేజ్​ హాల్​లో గత శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది. మూడంతస్తుల భవనంలోని లిఫ్ట్​ ప్రమాదంలో శీతల్​ అనే విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. ఈ కేసులో హాల్​ సూపర్​వైజర్​ తిరునవకరసు, లిఫ్ట్ ఆపరేషన్​ ఇంఛార్జ్​ ఎస్​ కక్కన్​​, మేనేజర్​ వెంకటేశన్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు. జయప్రియ పరారీలో ఉన్నారు.

"లిఫ్ట్​ను నిబంధనలకు అనుగుణంగా నిర్మించలేదు. అది కేవలం ఆహారం తీసుకెళ్లేందుకేనని, మనుషులు వెళ్లేందుకు కాదని సూపర్​వైజర్​ తెలిపాడు. ఈ భవనం 2015లో నిర్మించారు. లిఫ్ట్​ను దుంగలు, ప్లాస్టిక్​ షీట్లతో తయారు చేశారు. 300 కిలోల వరకు మాత్రమే మోసుకెళ్లగలదు. శుక్రవారం బాధితురాలు శీతల్​, మరో ఇద్దరు లిఫ్ట్​లో ఎక్కి రెండో అంతస్తుకు వెళ్తుండగా లిఫ్ట్​ గొలుసు తెగిపోయింది. బాలిక తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. "

- పోలీసులు.

అత్యాచారం కేసులో మంత్రి కుమారుడు: 23 ఏళ్ల యువతిపై అత్యాచారం కేసులో రాజస్థాన్​ మంత్రి మహేశ్​ జోషి కుమారుడు రోహిత్​ జోష్​ని అరెస్ట్​ చేసేందుకు జైపుర్​ చేరుకున్నారు దిల్లీ పోలీసులు.' అత్యాచారం కేసులో పరారీలో ఉన్న నిందితుడు రోహిత్​ను అరెస్ట్​ చేసేందుకు పోలీసు బృందం జైపుర్​ చేరుకుని తనిఖీలు చేపట్టింది.' అని ఉన్నతాధికారులు తెలిపారు.

జైపుర్​కు చెందిన 23 ఏళ్ల యువతి తనపై రాజస్థాన్​ పబ్లిక్​ హెల్త్​ ఇంజినీరింగ్​ శాఖ మంత్రి మహేశ్​ జోషి కుమారుడు రోహిత్​ జోషి ఏడాదిగా పలు సందర్భాల్లో అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేయగా తొలుత.. జీరో ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు దిల్లీ పోలీసులు. సదర్​ బజార్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోనూ ఓసారి అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొనటం ద్వారా జీరో ఎఫ్​ఐఆర్​ను రెగ్యులర్​ ఎఫ్​ఐఆర్​గా మార్చారు. దిల్లీ ఉత్తర జిల్లాలో మే 8న 376, 328, 312, 366, 377, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

'గత ఏడాది ఫేస్​బుక్​ ద్వారా రోహిత్​ జోషి పరిచయమయ్యాడు. తొలిసారి జైపుర్​లో కలిశాం. సవాయ్​ మాధోపుర్​కు రావాలని 2021, జనవరి 8న ఆహ్వానించాడు. తొలి మీటింగ్​లోనే కూల్​డ్రింగ్​లో మత్తుపదార్థాలు కలిపి నగ్న చిత్రాలు తీశాడు. మరోసారి దిల్లీలో కలిసి ఓ హోటల్​కు తీసుకెళ్లాడు. అక్కడ భార్యాభర్తలుగా రిజిస్టర్​ చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. మద్యం తాగి అత్యాచారానికి పాల్పడ్డాడు. వీడియో తీసి సోషల్​ మీడియోలో పోస్ట్​ చేస్తానని బెదిరించాడు. ఆ తర్వాత ఆగస్టులో గర్భం దాల్చినట్లు తెలిసింది. రోహిత్​కు చెప్పగా గర్భనిరోధక మాత్రలు మింగిచాలని ప్రయత్నించాడు.' అని ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు.

ఇదీ చూడండి: బాలికపై తల్లి ప్రియుడు అత్యాచారం​.. గర్భం దాల్చాక ఇంట్లోనే గుట్టుగా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.