సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తోన్న రైతులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. సమూహాలుగా ఏర్పడి ఆందోళనలు చేసినంత మాత్రాన చట్టాలు రద్దు కావని వ్యాఖ్యానించారు.
"రైతులతో ప్రభుత్వం ఇప్పటికే 12 సార్లు చర్చలు జరిపింది. అభ్యంతరం ఏంటో స్పష్టంగా తెలిపినప్పుడే నిర్ణయాలు తీసుకోగలం. నేరుగా చట్టాలను ఉపసంహరించుకోవాలని చెబుతున్నారు. జనాలు గుమిగూడి నిరసనలు చేసినంత మాత్రాన చట్టాలు రద్దు కావు. రైతులకు వ్యతిరేకంగా చట్టంలో ఏముందో కర్షక సంఘాలు చెప్పాలి. చట్టాల సవరణకు ప్రభుత్వం ఇప్పటికీ సిద్ధంగానే ఉంది. స్వయంగా ప్రధానమంత్రి అందుకు హామీ ఇచ్చారు," అని తోమర్ చెప్పారు.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో 3 నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తుండగా.. సవరణలు మాత్రమే చేస్తామని కేంద్రం చెబుతోంది.
ఇదీ చూడండి: 'సాగు చట్టాల ప్రయోజనాలను ప్రజలకు వివరించండి'