ETV Bharat / bharat

ఆ 3బిల్లులను వెనక్కి తీసుకున్న కేంద్రం- వాటిస్థానంలో కొత్తవి ప్రవేశపెట్టిన షా- శుక్రవారం ఓటింగ్ - amit shah speech in rajya sabha

Criminal Law Bills Withdrawn : క్రిమినల్ చట్టాల స్థానంలో తెచ్చిన మూడు బిల్లులను వెనక్కి తీసుకుంది కేంద్రం. వాటి స్థానంలో కొత్తవి లోక్​సభలో ప్రవేశపెట్టింది. హోంశాఖ పార్లమెంటు స్థాయి సంఘం సిఫార్సుల మేరకు బిల్లులకు సవరణ చేయటానికి బదులు మార్పులతో కొత్తగా ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు అమిత్‌ షా చెప్పారు.

Criminal Law Bills Withdrawn
Criminal Law Bills Withdrawn
author img

By PTI

Published : Dec 12, 2023, 7:00 PM IST

Updated : Dec 12, 2023, 8:35 PM IST

Criminal Law Bills Withdrawn : క్రిమినల్‌ చట్టాల స్థానంలో తెచ్చిన మూడు బిల్లులను ఉపసంహరించుకున్న కేంద్రం వాటి స్థానంలో కొత్తవి ప్రవేశపెట్టింది. లోక్‌సభ పార్లమెంటరీ స్థాయీ సంఘం చేసిన సిఫారసులను చేర్చి కొత్త ముసాయిదా బిల్లులను ప్రవేశపెట్టినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా చెప్పారు. క్రిమినల్‌ ప్రొసిజర్‌ యాక్ట్‌, ఇండియన్‌ పీనల్‌ కోడ్, ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ స్థానంలో తెచ్చిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం బిల్లులను తిరిగి డ్రాప్ట్‌ చేసి కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. హోంశాఖ పార్లమెంటు స్థాయీ సంఘం సిఫార్సుల మేరకు బిల్లులకు సవరణ చేయటానికి బదులు మార్పులతో కొత్తగా ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు అమిత్‌ షా చెప్పారు.

మూడు బిల్లులను అధ్యయనం చేయడానికి కొంత సమయం కావాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్‌ చేయగా గురువారం చర్చ, శుక్రవారం ఓటింగ్‌ ఉంటుందని అమిత్‌ షా ప్రకటించారు. మూడు బిల్లులను అధ్యయనం చేయటానికి 48గంటల సమయం ఉందన్నారు. ప్రధానంగా 5 విభాగాల్లో మార్పులు చేశామని చెప్పారు. చాలావరకు వ్యాకరణం, భాషకు సంబంధించినవే అని తెలిపారు. 3 బిల్లులను జాయింట్‌ కమిటీకి సిఫార్సు చేయాలన్న ప్రతిపక్షాల విజ్ఞప్తిని తోసిపుచ్చారు. పార్లమెంటు స్థాయీ సంఘం అనేక సిఫార్సులు చేసినట్లు చెప్పారు. మూడు బిల్లులపై చర్చకు 12 గంటలు కేటాయించినట్లు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు.

ఎలక్షన్ కమిషనర్ల బిల్లుకు రాజ్యసభ ఆమోదం
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించి తీసుకొచ్చిన బిల్లును రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. 1991 నాటి చట్టం స్థానంలో కేంద్రం దీన్ని తీసుకొచ్చింది. పాత చట్టంలో ఉన్న కొన్ని బలహీనతలను సవరించేందుకు కొత్త చట్టం అవసరమైందని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్​వాల్​ వ్యాఖ్యానించారు. సీఈసీ, ఈసీల నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తప్పించుకునేందుకే ఈ బిల్లును తీసుకొచ్చారని విపక్షాలు చేసిన ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగానే ఈ బిల్లును తీసుకొచ్చినట్లు తెలిపారు.

గతంలో CEC, ECల ఎంపికలో ప్రధాని నేతృత్వంలోని త్రిసభ్య కమిటీలో CJI, లోక్‌సభలో ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఎంపిక కమిటీల్లో భారత ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేంద్ర మంత్రి ఉంటారు. ఈ ప్రతిపాదిత కమిటీపైనే విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. బిల్లు ఆమోదం సమయంలో సభ నుంచి వాకౌట్‌ చేశాయి. మరోవైపు, గతంలో మాదిరిగానే సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమానంగా సీఈసీ, ఇతర ఎన్నికల కమిషనర్ల హోదాను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

'భారత ఆర్థిక వ్యవస్థ భేష్'
భారత ఆర్థిక వ్యవస్థ సరైన దిశలో పయనిస్తోందని తెలిపారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించిందని లోక్​సభలో నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1.29 లక్షల కోట్లకు నికర అదనపు వ్యయానికి లోక్​సభ మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ నిధుల్లో ఎక్కువ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం, ఎరువుల సబ్సిడీకి కేటాయించనున్నారు. మరోవైపు, మహిళా రిజర్వేషన్ చట్టంలోని నిబంధనలను కేంద్ర పాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి, జమ్ముకశ్మీర్‌కు విస్తరించేందుకు ఉద్దేశించిన రెండు బిల్లులను లోక్​సభలో ప్రవేశపెట్టారు కేంద్రమంత్రి నిత్యానంద రాయ్​.

రాజస్థాన్ కొత్త​ సీఎంగా భజన్​ లాల్ శర్మ- ఫస్ట్​ టైమ్​ ఎమ్మెల్యేకు పగ్గాలు

'70ఏళ్లుగా లూటీ, ఇది కాంగ్రెస్ మనీహీస్ట్'- రూ.351 కోట్లపై మోదీ సెటైర్లు

Last Updated : Dec 12, 2023, 8:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.