Crime Journalist Murdered : బిహార్‌లోని అరరియా జిల్లాలో ఓ దినపత్రికకు క్రైమ్ జర్నలిస్ట్‌గా పనిచేస్తున్న వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపారు. దీంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. మృతుడిని విమల్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని రాణిగంజ్ బ్లాక్‌లో ఈ ఘటన జరిగింది. మృతుడు విమల్ కుమార్ యాదవ్.. గతకొన్నేళ్లుగా ఓ వార్తాపత్రికలో రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు. అయితే శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో నలుగురు వ్యక్తులు విమల్ ఇంటి తలుపు తట్టారు. వెంటనే విమల్ తలుపు తీయగా.. అతడి ఛాతిపై కాల్పులు జరిపి పరారయ్యారు. అక్కడికక్కడే విమల్ కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు.. అతడిని రాణిగంజ్ ఆస్పత్రికి తరలించినా లాభం లేకుండాపోయింది. అప్పటికే విమల్ మరణించినట్లు వైద్యులు నిర్ధరించారు.
-
Araria, Bihar | "In the Raniganj Bazar area, a journalist namely Vimal Kumar Yadav was shot dead by unidentified miscreants...post-mortem is being done, dog squad has been called to the murder spot...investigation is on and efforts to arrest the culprits are underway": Ashok… pic.twitter.com/ipvhw6nabL
— ANI (@ANI) August 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Araria, Bihar | "In the Raniganj Bazar area, a journalist namely Vimal Kumar Yadav was shot dead by unidentified miscreants...post-mortem is being done, dog squad has been called to the murder spot...investigation is on and efforts to arrest the culprits are underway": Ashok… pic.twitter.com/ipvhw6nabL
— ANI (@ANI) August 18, 2023Araria, Bihar | "In the Raniganj Bazar area, a journalist namely Vimal Kumar Yadav was shot dead by unidentified miscreants...post-mortem is being done, dog squad has been called to the murder spot...investigation is on and efforts to arrest the culprits are underway": Ashok… pic.twitter.com/ipvhw6nabL
— ANI (@ANI) August 18, 2023
ఈ ఘటనపై స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. విమల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శవపరీక్షల కోసం అరరియా సదర్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫోరెనిక్స్ బృందాన్ని పిలిపించారు. విచారణ ప్రారంభించామని.. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఎస్పీ అశోక్ కుమార్ సింగ్ తెలిపారు. విమల్ కుమార్ హత్య తర్వాత అతడి కుటుంబసభ్యులు భయాందోళనకు గురవుతున్నట్లు వెల్లడించారు. అయితే వారికి తాను అండగా ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎవరూ భయపడి జీవించాల్సిన అవసరం లేదన్నారు.
'తన అన్న హత్య కేసులో విమల్ ప్రత్యక్ష సాక్షి'
Journalist Murdered : తన భర్త సోదరుడిని నాలుగేళ్ల క్రితం కొందరు హత్య చేశారని మృతుడు విమల్ కుమార్ భార్య తెలిపింది. "ఆ హత్య కేసులో నా భర్తే ప్రత్యక్ష సాక్షి. ప్రస్తుతం ఈ కేసు విచారణ కోర్టులో కొనసాగుతోంది. కోర్టులో వాంగ్మూలం ఇచ్చినందుకు విమల్‌కు నిత్యం బెదిరింపులు వచ్చేవి. ఆ తర్వాత భద్రత కల్పించాలని పోలీసులను కోరాం. పోలీసులు కనీస భద్రత కల్పించలేదు. బెదిరించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు" అని విమల్ భార్య ఆరోపించింది.
'సీఎం నీతీశ్ రాజీనామా చేయాల్సిందే'
ఈ ఘటన తర్వాత బిహార్‌లో నీతీశ్ ప్రభుత్వంపై ప్రతిపక్ష నాయకులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో నేరాలు బాగా పెరిగిపోయాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్.. తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బిహార్ ప్రజలు సురక్షితంగా లేరని ఆరోపణలు చేశారు.
'రాష్ట్రంలో జంగిల్ రాజ్..'
Crime Reporter Killed : అరరియా ఎంపీ ప్రదీప్ కుమార్ సింగ్.. విమల్ కుమార్ ఇంటికి చేరుకుని బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. నాలుగేళ్ల క్రితమే జర్నలిస్ట్ విమల్ సోదరుడు హత్యకు గురయ్యాడని తెలిపారు. ఆ సమయంలోనే నేరస్థులకు శిక్ష పడితే ఈరోజు ఇలా జరిగి ఉండేది కాదని అన్నారు. "రాష్ట్రంలో జంగిల్ రాజ్ మొదలైంది. ఇప్పుడు బిహార్‌కు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లాంటి సీఎం అవసరం. మూడు రోజుల క్రితం ఇన్‌స్పెక్టర్ హత్య.. నేడు జర్నలిస్ట్ మర్డర్.. ఎన్ని హత్యలు జరుగుతున్నా.. నీతీశ్ ప్రభుత్వం నిందితులను పట్టుకోవడం లేదు" అని ఆరోపించారు.
జర్నలిస్ట్ మృతి ఘటన దురదృష్టకరం : సీఎం
జర్నలిస్ట్ విమల్ కుమార్ యాదవ్ హత్యపై ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ స్పందించారు. అతడి మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. అతడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇది చాలా దురదృష్టకర ఘటన అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.