ETV Bharat / bharat

'పిడకల' తయారీపై వర్సిటీలో పాఠాలు.. వీడియో వైరల్​

author img

By

Published : Feb 7, 2022, 2:18 PM IST

Updated : Feb 7, 2022, 2:27 PM IST

Cow dung cakes: విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు ఆవు పేడతో పిడకలు ఎలా చేయాలో నేర్పిస్తున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. దీనిపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిడకలు చేయటం నేర్పించేందుకు ప్రొఫెసర్లు అవసరం లేదంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ సంఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని బనారస్​ హిందూ విశ్వవిద్యాలయంలో జరిగింది.

cow dung cakes
వర్సిటీలో 'పిడకల' తయారీపై పాఠాలు

Cow dung cakes: విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థులు.. పెద్ద పెద్ద పుస్తకాలతో కుస్తీ పడుతూ.. ప్రయోగాలు చేస్తూ ఉంటారని అందరికీ తెలుసు. అయితే, వారు పిడకలు ఎలా చేయాలో నేర్చుకుంటే వింతే కదా? ఉత్తర్​ప్రదేశ్​ వారణాసిలోని ప్రముఖ బనారస్​ హిందూ విశ్వవిద్యాలయం(బీహెచ్​యూ) విద్యార్థులు ఆవు పేడతో పిడకలు ఎలా చేయాలో నేర్చుకుంటున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.

cow dung cakes
పిడకలు తయారు చేస్తున్న విద్యార్థులు

వర్సిటీ సోషల్​ సైన్స్​ ఫ్యాకల్టీ ప్రొఫెసర్​ కౌషల్​ కిశోర్​ మిశ్రా.. విద్యార్థులకు ఆవు పేడతో పిడకలు ఎలా చేయాలో నేర్పిస్తున్నారు. విద్యార్థులకు పిడకలపై పాఠాలు చెబుతున్న వీడియో వైరల్​గా మారింది. అందులో మిశ్రా చుట్టూ పలువురు విద్యార్థులు కూర్చుని, పిడకలు చేసే విధానాన్ని తెలుసుకుంటున్నారు. ఆ తర్వాత బీహెచ్​యూ వర్సిటీ సైతం దీనిపై ట్వీట్​ చేసింది. వర్సిటీ ప్రాంగణంలోని ఇంటిగ్రేటెడ్​ విలేజ్​ డెవలప్​మెంట్​ సెంటర్​లో వర్క్​షాప్​ నిర్వహించినట్లు పలు ఫొటోలను షేర్​ చేసింది.

cow dung cakes
పిడకల తయారీలో నిమగ్నమైన వర్సిటీ విద్యార్థులు

" ఈ పిడకలను పూజలు, హోమం వంటి వాటిలో ఉపయోగిస్తారు. ఆహారం వండేందుకు ఇంధనంగా వాడతారు. ఆవు పేడతో చేసిన ఉత్పత్తులను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి. అది రైతుల ఆదాయం పెరిగేందుకు దోహదపడుతుంది. విద్యార్థులు గ్రామాల్లోకి వెళ్లి పిడకలు ఎలా చేయాలో వివరిస్తారు."

- ప్రొఫెసర్​ కౌషల్​ కిశోర్​ మిశ్రా, బీహెచ్​యూ

ఇలాంటి వర్క్​షాప్​లు పెట్టటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. 'ఉన్నత విద్య కోసం విశ్వవిద్యాలయాలు ఉంటాయి. అక్కడికి వెళ్లేది ప్రత్యేకమైన జ్ఞానం సంపాదించేందుకు. అయితే, ఆవు పేడతో పిడకలు చేసేందుకు మాత్రం కాదు. '- అని ఓ నెటిజన్​ పోస్ట్ చేశారు.

cow dung cakes
విద్యార్థులకు పిడకల తయారీ నేర్పిస్తున్న ప్రొఫెసర్​

ఇలాంటి శిక్షణను గ్రామీణ మహిళలు సులభంగా చేస్తారని, అందుకు ప్రొఫెసర్లు అవసరం లేదని ఓ నెటిజన్​ రాసుకొచ్చారు.

cow dung cakes
ప్రొఫెసర్​ కిశోర్​ మిశ్రా

ఇదీ చూడండి: Nest man: అభినవ 'పక్షిరాజు'.. 2 లక్షలకుపైగా గూళ్లు నిర్మాణం

Last Updated : Feb 7, 2022, 2:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.