ETV Bharat / bharat

'ఆర్డర్లు లేవు.. కొవిషీల్డ్‌ ఉత్పత్తిని 50% తగ్గిస్తాం'

author img

By

Published : Dec 8, 2021, 3:24 AM IST

Updated : Dec 8, 2021, 6:39 AM IST

Covishield News: వచ్చే వారం నుంచి కొవిషీల్డ్ ఉత్పత్తిని 50శాతం మేర తగ్గించాలని నిర్ణయించినట్లు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) సీఈఓ అదర్‌ పూనావాలా వెల్లడించారు. ప్రభుత్వం నుంచి ఆర్డర్లు లేని కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

Covishield News
కొవిషీల్డ్‌

Covishield News: కేంద్ర ప్రభుత్వం నుంచి తదుపరి ఆర్డర్లు లేనందున వచ్చే వారం నుంచి కొవిషీల్డ్ ఉత్పత్తిని 50శాతం మేర తగ్గించాలని నిర్ణయించినట్లు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) సీఈఓ అదర్‌ పూనావాలా వెల్లడించారు. మంగళవారం ఆయన ఓ జాతీయ వార్తా సంస్థతో మాట్లాడారు. ఒకవేళ దేశానికి భారీ మొత్తంలో స్టాక్ అవసరం అనుకుంటే.. అదనపు వ్యాక్సిన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని కొనసాగించాలనుకుంటున్నట్లు చెప్పారు. 'ప్రభుత్వం నుంచి ఆర్డర్లు లేని కారణంగా కొవిషీల్డ్‌ ఉత్పత్తిని 50శాతం తగ్గించనున్నాం. ప్రభుత్వం కోరితే అదనపు ఉత్పత్తి సామర్థ్యాన్ని కొనసాగిస్తాం. వచ్చే ఆరు నెలల్లో టీకాలు అందించలేని పరిస్థితిలో అయితే ఉండబోం' అని పేర్కొన్నారు. కేంద్రం సైతం 20 నుంచి 30 మిలియన్ డోసుల స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్‌ను నిల్వ ఉంచుతుందని, ఎక్కువ రిస్క్ తీసుకోదని కూడా చెప్పారు. లైసెన్స్ పొందిన వెంటనే, చాలా ఎక్కువ రేటుతో ఉత్పత్తి చేయొచ్చు అని తెలిపారు.

ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుత వ్యాక్సిన్‌ల సమర్థతపై అదర్‌ పూనావాలా మాట్లాడుతూ.. ఇప్పటికే అందుబాటులో ఉన్న టీకాలు కొత్త వేరియంట్‌పై పనిచేయవని నమ్మడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. 'లాన్సెట్' జర్నల్‌ ప్రకారం ఆస్ట్రాజెనెకా 80 శాతం సమర్థత కలిగి ఉందని తేలినట్లు చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఉన్న టీకాలు ఒమిక్రాన్‌పై అంత ప్రభావం చూపే అవకాశం లేదంటూ మోడెర్నా సంస్థ అధ్యక్షుడు స్టీఫెన్‌ హోగ్‌ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. తగినంత సమాచారం లేకుండా ఆయన చేసిన ఈ ప్రకటన వెనుక కారణాల గురించి తనకు తెలియదన్నారు. సరైన సమాచారం లేకుండా అంచనాలు వేయడంపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 'కొవాక్స్' కార్యక్రమం కోసం 40-50 కోట్ల డోసుల ఆర్డర్‌లను సమీక్షించానని, ఆఫ్రికన్‌ దేశాల ప్రతినిధులతో టచ్‌లో ఉన్నానని వివరించారు. ప్రస్తుత ప్రపంచ వ్యాక్సిన్ సరఫరా అవసరమైనదానికంటే ఎక్కువగా ఉందని చెప్పారు.

ఇదీ చదవండి: భారీగా తగ్గిన కరోనా వ్యాప్తి.. 558 రోజుల కనిష్ఠానికి కొత్త కేసులు

Last Updated : Dec 8, 2021, 6:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.