ETV Bharat / bharat

'వ్యాక్సిన్​ డోసుల పంపిణీలో 90 శాతం కొవిషీల్డ్‌ టీకాలే ' - భారత్ బయోటెక్

కొవిడ్-19 కట్టడి కోసం దేశవ్యాప్తంగా అందిస్తున్న వ్యాక్సిన్​ డోసుల్లో 90 శాతానికి పైగా కొవిషీల్డ్​ టీకాలే ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలోని 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కేవలం కొవిషీల్ట్‌ టీకాను మాత్రమే అందజేసినట్లు ఓ నివేదికలో కేంద్రం వెల్లడించింది. మరోవైపు.. అత్యంత వేగంగా 95 రోజుల్లోనే 13 కోట్ల డోసుల పంపిణీ చేసి భారత్ మరో మైలురాయిని అధిగమించింది.

covishield
కొవిషీల్డ్ వ్యాక్సిన్
author img

By

Published : Apr 21, 2021, 4:10 PM IST

కరోనా కట్టడి కోసం దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు అందించిన వ్యాక్సిన్‌ డోసులలో సీరం ఇనిస్టిట్యూట్‌ తయారీ చేస్తున్న కొవిషీల్డ్‌ టీకాలే 90శాతం ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలో ఇప్పటి వరకు 12కోట్ల 76లక్షల 5వేల 870 కరోనా టీకా డోసులను అందజేయగా, వీటిలో కొవిషీల్డ్‌ డోసులు 11 కోట్ల 60లక్షల 65వేల 107 ఉన్నట్లు కొవిన్‌ పోర్టల్‌లో కేంద్రం వివరాలను పొందుపర్చింది. భారత్‌ బయోటెక్‌ తయారు చేస్తున్న కొవాగ్జిన్‌ టీకా డోసులు ఒక కోటి 15లక్షల 40వేల 763 అందజేసినట్లు కేంద్రం వెల్లడించింది.

కేవలం కొవిషీల్డ్ మాత్రమే..

దేశంలోని 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కేవలం కొవిషీల్ట్‌ టీకాను మాత్రమే అందజేసినట్లు ఓ నివేదికలో కేంద్రం వెల్లడించింది. కొవాగ్జిన్‌ కంటే కొవిషీల్డ్‌ టీకాల తయారీ భారీ ఎత్తున జరుగుతున్నందున అవి ఎక్కువగా అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. త్వరలోనే కొవాగ్జిన్‌ టీకా ఉత్పత్తి కూడా పెరుగుతుందని భారత వైద్య పరిశోధనా మండలి నిపుణులు సమీరన్‌ పాండా తెలిపారు. కొవాగ్జిన్‌ టీకాల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏడాదికి 70 కోట్లకు పెంచుకోనున్నట్లు మంగళవారం భారత్‌ బయోటెక్‌ కూడా ప్రకటించింది.

95 రోజుల్లోనే 13 కోట్ల డోసుల పంపిణీ

vaccine doses
టీకా డోసుల వివరాలు

కరోనా వైరస్‌ టీకా పంపిణీలో భారత్‌ మరో మైలు రాయిని అధిగమించింది. అత్యంత వేగంగా 95 రోజుల్లోనే 13 కోట్ల డోసుల పంపిణీని పూర్తి చేసుకుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. యూఎస్‌లో ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి 101 రోజులు పట్టగా.. చైనాలో 109 రోజులు సమయం పట్టినట్లు తెలిపింది.

"వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భాగంగా భారత్‌ 95 రోజుల్లో 13 కోట్ల డోసుల పంపిణీ పూర్తి చేసుకుంది. తాజా గణాంకాల ప్రకారం మంగళవారం ఇచ్చిన వాటితో కలిపి మొత్తం 13.01కోట్లకు పైగా డోసులు పంపిణీ చేశాం. 8 రాష్ట్రాల్లో టీకా ప్రక్రియ 59.33 శాతంగా నమోదైంది. అందులో మహారాష్ట్ర, రాజస్థాన్‌, యూపీ, గుజరాత్‌, బంగాల్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, కేరళ ఉన్నాయి."

-- కేంద్ర ప్రభుత్వం ప్రకటన

గడిచిన 24 గంటల్లో 29.90 లక్షల డోసులు పంపిణీ చేశారు. మరోవైపు మే 1 నుంచి దేశంలో 18 ఏళ్లు పైబడిన వారికి టీకా ఇచ్చేందుకు కేంద్రం మంగళవారం నిర్ణయించింది.

ఇదీ చదవండి : ఆక్సిజన్ ట్యాంక్​ లీకేజీ- 22 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.