Covid vaccine precautions dose due date: కొవిడ్ బూస్టర్ డోస్ కాలపరిమితి తగ్గిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా టీకా రెండో డోసు పూర్తయిన 6 నెలలకే ప్రికాషన్ డోసు ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. 18 నుంచి 59 ఏళ్ల మధ్య వారందరికీ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. కరోనా టీకాపై ఏర్పాటైన జాతీయ సలహా బృందం సూచన మేరకు కాలవ్యవధిని ఈమేరకు సవరిస్తున్నట్లు తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ.
ఇప్పటివరకు రెండో డోసు తీసుకున్న 9 నెలల తర్వాతే ప్రికాషన్ డోసు వేస్తున్నారు. కొత్త మార్గదర్శకాలపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖలు రాశారు. శాస్త్రీయ ఆధారాలు, ప్రపంచవ్యాప్తంగా ఎదురైన అనుభవాల దృష్ట్యా రెండో డోస్‌కు, బూస్టర్ డోస్‌కు మధ్య సమయాన్ని తగ్గించాలని జాతీయ సలహా బృందం సిఫార్సు చేసిందని లేఖలో పేర్కొన్నారు. కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్‌లతో పాటు ఇంటింటికీ వెళ్లి బూస్టర్ డోస్ వేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్రాలకు సూచించారు.
ఇదీ చదవండి: కేంద్ర మంత్రి పదవికి నఖ్వీ రాజీనామా- ఉపరాష్ట్రపతిగా అవకాశం!