దేశంలో ఇప్పటివరకు 2.26 కోట్ల కరోనా టీకా డోసులను అందించినట్లు కేంద్ర వైద్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సోమవారం రాత్రి 9 గంటల నాటికి 16,96,588 మందికి టీకా ఇచ్చినట్లు వెల్లడించింది.
సోమవారం 14,30,954 మంది లబ్ధిదారులు తొలి డోసు స్వీకరించగా.. 2,65,634 మంది వైద్య సేవల సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లు రెండో డోసును తీసుకున్నారని వైద్య శాఖ తెలిపింది.
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ జనవరి 16న ప్రారంభమైంది. తొలుత వైద్య సేవల సిబ్బందికి టీకా అందించారు. మార్చి 1 నుంచి.. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, 45 ఏళ్లు పైబడిన దీర్ఘకాల వ్యాధులు ఉన్నవారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు.