దేశంలో కరోనా మరణాలకు అడ్డుకట్ట పడటం లేదు. శుక్రవారం సైతం నాలుగు వేలకు పైగా కరోనా మరణాలు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం 24 గంటల వ్యవధిలో 4,194మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి: జ్వరం టీకాతోనా?.. వైరస్‌వల్లా?
అటు వైరస్ విజృంభణ సైతం కొనసాగుతోంది. మరో 2,57,299లక్షల మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. వైరస్ బారిన పడ్డవారిలో 3,57,630మంది తాజాగా కోలుకున్నారు.
ఇదీ చదవండి: టీకా తొలి డోసు తీసుకున్నాక కరోనా వస్తే?
- మొత్తం కేసులు: 2,62,89,290
- మరణాలు: 2,95,525
- మొత్తం రికవరీలు: 2,30,70,365
- యాక్టివ్ కేసులు: 29,23,400
- " class="align-text-top noRightClick twitterSection" data="">
పరీక్షలు
శుక్రవారం సైతం 20 లక్షలకు పైగా కరోనా టెస్టులు జరిగాయి. మొత్తం 20,66,285 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. గురువారం 20,61,683 పరీక్షలు నిర్వహించింది. దీంతో ఇప్పటివరకు పరీక్షించిన నమూనాల సంఖ్య 32,64,84,155కు చేరింది.
ఇదీ చదవండి: టీకా సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
వ్యాక్సినేషన్
మరోవైపు, దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. 14,58,895 డోసులను శుక్రవారం లబ్ధిదారులకు అందించింది. దీంతో 19,33,72,819 డోసుల పంపిణీ పూర్తయింది.
ఇదీ చదవండి: కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్-వి మధ్య తేడా ఏంటి?