ETV Bharat / bharat

ఆ రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ల కలకలం.. బూస్టర్​ డోసు తీసుకున్నా!

author img

By

Published : May 29, 2022, 3:33 AM IST

Covid Sub Variants: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ ప్రమాదకరమైన ఒమిక్రాన్‌ ఉప వేరియంట్లు మళ్లీ ఆందోళన కలిగిస్తున్నాయి. మహారాష్ట్రలో నాలుగు బీఏ-4 కేసులు, మూడు బీఏ-5 కేసులు నమోదయ్యాయి. అయితే వారందరికి స్వల్ప లక్షణాలే ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు

మహారాష్ట్ర
మహారాష్ట్ర

Covid Sub Variants: కరోనా కేసులు తగ్గాయని అంతా ఊపిరిపీల్చుకుంటున్న తరుణంలో ఒమిక్రాన్‌ ఉపవేరియంట్లు మళ్లీ కలకలం రేపుతున్నాయి. మహారాష్ట్రలో ఏడు ఒమిక్రాన్‌ ఉప వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి. నాలుగు బీఏ.4 కేసులు, మూడు బీఏ.5 కేసులు నమోదైనట్టు వైద్యులు ప్రకటించారు. ఒమిక్రాన్‌ ఉపవేరియంట్ల బారిన పడిన ఏడుగురికీ స్వల్ప లక్షణాలే ఉన్నట్లు తెలిపారు. కాగా వీరంతా పుణెకు చెందినవారు కావడం గమనార్హం. వారందరినీ హోం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు వివరించారు.

"జీనోమ్ సీక్వెన్సింగ్‌ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నిర్వహించింది. ఈ సీక్వెన్సింగ్‌ను ఫరీదాబాద్‌లోని ఇండియన్ బయోలాజికల్ డేటా సెంటర్ ధృవీకరించింది. ఇందులో పుణెకు చెందిన ఏడుగురు ఒమిక్రాన్ ఉపవేరియంట్ల బారినపడినట్లు నిర్ధరణ అయ్యింది. వీరిలో నలుగురికి బీఏ.4 సోకగా, మరో ముగ్గురు బీఏ.5 ఉప వేరియంట్‌ బారినపడ్డారు. ఈ ఏడుగురిలో ముగ్గురు మహిళలతో పాటు తొమ్మిదేళ్ల బాలుడు కూడా ఉన్నాడు " అని వైద్యాధికారి పేర్కొన్నారు.

వైరస్‌ బారిన పడినవారిలో ఇద్దరు విదేశాలకు వెళ్లివచ్చారని, మరో ముగ్గురు ఇతర రాష్ట్రాలకు ప్రయాణించినట్లు అధికారులు వెల్లడించారు. మరో ఇద్దరు మాత్రం ఎక్కడికీ వెళ్లలేదని తెలిపారు. బాలుడు మినహా మిగతా ఆరుగురు కూడా వ్యాక్సినేషన్‌ పూర్తిస్థాయిలో తీసుకున్నారని, ఓ వ్యక్తి బూస్టర్‌ డోసు కూడా తీసుకున్నట్లు పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో వ్యాప్తి చెందిన ఒమిక్రాన్‌ ఉప వేరియంట్లు బీఏ.4, బీఏ.5లు భారత్‌లో గుర్తించినట్లు ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం (INSACOG) కొద్దిరోజుల క్రితమే వెల్లడించించిన విషయం తెలిసిందే. తమిళనాడు, తెలంగాణలో ఈ కేసులు ఇప్పటికే బయటపడ్డాయి.

ఇవీ చదవండి: ఆ గ్రామంలో ఇప్పటికీ అంధ విశ్వాసాలు.. బాలింతలకు నో ఎంట్రీ

సింహాన్ని కాటేసిన విషసర్పం.. వైద్యులు ఎంత ప్రయత్నించినా దక్కని గంగ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.