ETV Bharat / bharat

బిహార్​ ఎన్నికల్లో 160టన్నుల బయోమెడికల్​ వ్యర్థాలు - biomedical waste management in bihar

బిహార్​ ఎన్నికలు కరోనా సమయంలో జరిగాయి. మహమ్మారి బారి నుంచి తప్పించుకునేందుకు ఎన్నికల సంఘం యంత్రాంగానికి కావాల్సిన మెడికల్​ అవసరాలను అందించింది. ప్రస్తుతం ఆ బయోమెడికల్ వ్యర్థాలు 160 టన్నులు అయ్యాయని అధికారులు తెలిపారు. వాటిని సేకరించే పనిలో ఉన్నట్టు స్పష్టం చేశారు.

COVID: Nearly 160 tonnes of biomedical waste generated during Bihar polls
బిహార్​ ఎన్నికల్లో 160 టన్నుల మెడికల్​ వ్యర్థాలు
author img

By

Published : Nov 15, 2020, 6:03 PM IST

కరోనా సంక్షోభం మధ్య జరిగిన బిహార్ ఎన్నికల్లో అధికార యంత్రాంగం, ఓటర్లు ఉపయోగించిన చేతి తొడుగులు, ఫేస్ మాస్క్‌లు, ఖాళీ శానిటైజర్ బాటిళ్లు వంటి బయోమెడికల్​ వ్యర్థాలు దాదాపు 160 టన్నులు అయ్యాయని అధికారులు తెలిపారు. ఈ ఎన్నికల కోసమని సిబ్బంది అవసరాలకు తగ్గట్టుగా ఎన్నికల సంఘం​ 18 లక్షల ఫేస్​ షీల్డ్​లు,70 లక్షల ఫేస్​ మాస్క్​లు, 5.4 లక్షల చేతి తొడుగులు, 7.21 కోట్ల సింగిల్ యూజ్ పాలిథిన్ తొడుగులను కొనుగోలు చేసింది.

అయితే ఈ వ్యర్థాల నిర్వహణ కోసమై అధికారులకు శిక్షణ కూడా ఇచ్చారు. కానీ ఉపయోగం లేకపోవడం వల్ల స్థానికంగా ఉండే పారిశుధ్య సిబ్బంది చేత వాటిని సేకరించే పనిలో పడింది.

బయోమెడికల్​ వ్యర్థాలు హానికరం. వాటిని సేకరించే పనిలో ఉన్నాం. అవి సుమారు 160 టన్నులు ఉన్నాయి. వాటిని బయో మెడికల్​ వేస్టేజ్​ ఏజెన్సీతో రిసైకిల్​ చేయవచ్చు. దీనిలో ఒక సవాలు ఉంది. ఈ ఏజెన్సీలు అన్నీ స్థానిక ఆరోగ్య కేంద్రాల నుంచి మాత్రమే వ్యర్థాలను సేకరిస్తాయి. పోలింగ్​బూత్​కి వెళ్లాలి అంటే కష్టం. బూత్​కు ఇద్దరు చొప్పున సిబ్బందిని నియమించాం. వారే వాటిని సేకరిస్తారు. అక్కడ నుంచి ఆరోగ్య కేంద్రాలకు, ఏజెన్సీలకు చేరుతాయి. వాటిని గుర్తించేందుకు ట్రాకింగ్ డివైజ్​ను యాప్​ ద్వారా అందుబాటులో ఉంచాం.

-శ్రీనివాస్​, ఎన్నికల అధికారి.

ఇదీ చూడండి: కాన్పుర్​లో 'స్పుత్నిక్​-వీ' క్లినికల్​ ట్రయల్స్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.