కరోనా టీకా.. విభిన్న కొవిడ్ వేరియంట్ల నుంచి పూర్తిగా రక్షణ కల్పించకపోవచ్చు.. కానీ వ్యాధి తీవ్రత, మరణ ప్రమాదాలను కచ్చితంగా తగ్గిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రధాన సౌమ్య స్వామినాథన్ తెలిపారు. విస్తృత కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. అలాగే రానున్న రోజుల్లో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌తో జరిగిన సమావేశంలో.. దేశంలోని ప్రస్తుత కొవిడ్ పరిస్థితి సహా పలు అంశాలపై చర్చించారు.
ఈ క్రమంలోనే విభిన్న ఆచారాలు, సంప్రదాయాలు ఉన్న భారత్లో భారీ వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించడం అంత సులభం కాదని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత్ శక్తి సామర్థ్యాలు మరింత పెరిగాయన్నారు. వనరుల కొరత ఉన్నప్పటికీ.. ఏడాదిలో గణనీయంగానే టీకాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ అందించే స్థితిలో ఉన్నట్లు సింగ్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: మిజోరంలో 128 మంది చిన్నారులకు కరోనా.. కేరళలో..