ETV Bharat / bharat

భారత్​లో మళ్లీ పెరుగుతున్న కొవిడ్​ తీవ్రత.. కొరియాలో తగ్గని ఉద్ధృతి - ప్రపంచంలో కరోనా కేసులు

Covid Cases In India: దేశంలో కరోనా తీవ్రత మరోసారి పెరుగుతోంది. కొత్తగా 2628 మందికి వైరస్​ సోకినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహమ్మారి కారణంగా మరో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. కోలుకున్నవారి సంఖ్య 98.75 శాతానికి చేరింది. ప్రపంచవ్యాప్తంగా కూడా భారీగా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 5,88,431 కేసులు బయటపడ్డాయి.

కరోనా
కరోనా
author img

By

Published : May 26, 2022, 9:42 AM IST

INDIA COVID CASES: భారత్​లో కొవిడ్​ తీవ్రత క్రమంగా మళ్లీ పెరుగుతోంది. బుధవారం కొత్తగా 2,628 కేసులు వెలుగుచూశాయి. 18 మంది ప్రాణాలు కోల్పోగా.. ఒక్కరోజే 2167 మంది కరోనాను జయించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కోలుకున్నవారి శాతం 98.75గా ఉంది.

  • మొత్తం కరోనా కేసులు: 4,31,44,820
  • మొత్తం మరణాలు: 5,24,525
  • యాక్టివ్​ కేసులు: 15,414
  • కోలుకున్నవారి సంఖ్య: 4,26,04,881

Vaccination India: దేశవ్యాప్తంగా మంగళవారం 13,13,687 మందికిపైగా టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,92,82,03,555కు చేరింది. ఒక్కరోజే 4,52,580 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.

World Covid Cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఒక్కరోజే మరో 5,88,431 మందికిపైగా వైరస్​ బారినపడ్డారు. మరో 1,630 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 52,95,40,303కు చేరింది. మరణాల సంఖ్య 6,306,062కు చేరింది. ఒక్కరోజే 7,12,603 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 49,99,85,221గా ఉంది.

  • అమెరికాలో కొత్తగా 1,01,221 కేసులు నమోదయ్యాయి. 317 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • జర్మనీలో 47,176 కేసులు వెలుగుచూశాయి. 147 మంది చనిపోయారు.
  • ఆస్ట్రేలియాలో తాజాగా 45,817 కేసులు నమోదయ్యాయి. మహమ్మారితో 86 మంది మృతిచెందారు.
  • బ్రెజిల్​లో కొత్తగా 9,787 కేసులు బయటపడ్డాయి. వైరస్​ ధాటికి 157 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఫ్రాన్స్​లో తాజాగా 22,006 కేసులు నమోదయ్యాయి. మరో 51 మంది మృతిచెందారు.

కొరియాపై కొవిడ్ పంజా: ఉత్తర కొరియాలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా మరో 1,05,500 మంది కరోనా బారినపడ్డారు. బుధవారం నాటికి 68 మరణించగా.. కొత్తగా మరణాలు నమోదు కాలేదు. ఉత్తర కొరియాలో ఇప్పటివరకు 31,70,380 మందికి కరోనా సోకగా.. 28,98,500 మంది కోలుకున్నట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇదీ చూడండి : కల్తీ మద్యం కలకలం.. నాలుగురోజుల్లోనే 17 మంది మృతి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.