Covid Cases In India: భారత్‌లో రోజువారీ కొవిడ్ కేసులు 3 వేల దిగువన నమోదవుతున్నాయి. కొత్తగా దేశంలో 2,568 మంది వైరస్ బారిన పడ్డారు. తాజాగా 4,722 వైరస్‌ను జయించారు.
- మొత్తం కేసులు: 4,29,96,062
- మొత్తం మరణాలు: 5,15,974
- యాక్టివ్ కేసులు: 33,917
- కోలుకున్నవారు: 4,24,46,171
Vaccination in India
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. సోమవారం మరో 19,64,423 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,80,40,28,891కు పెరిగింది.
World Corona cases
ప్రపంచవ్యాప్తంగానూ రోజువారీ కరోనా కేసుల సంఖ్య తగ్గింది. తాజాగా 11,95,313 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 45,97,16,512పెరిగింది. మరో 4,009 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 6,066,237కు చేరింది.
- దక్షిణ కొరియాలో 309,769కరోనా కేసులు నమోదయ్యాయి. 200మంది కరోనా రోగులు మరణించారు.
- జర్మనీలో తాజాగా 101,872కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. మరో 136మంది మృతి చెందారు.
- వియత్నాంలో 161,262మంది వైరస్ సోకింది. మరో 92 ప్రాణాలు కోల్పోయారు.
- అమెరికాలో కొత్తగా 17,267మంది కొవిడ్ బారినపడ్డారు. మరో 326మంది వైరస్‌కు బలయ్యారు.
- రష్యాలో ఒక్కరోజే 41,055కేసులు బయటపడ్డాయి. 533మంది మరణించారు.
- బ్రెజిల్లో మరో 13,420మందికి వైరస్ సోకగా.. 187మంది చనిపోయారు.
- ఫ్రాన్స్‌లో 18,853 కరోనా కేసులు బయటపడ్డాయి. 185 మంది మృతి చెందారు.
ఇదీ చూడండి: 'కరోనా పరిహారం కోసం అక్రమాలా? మరీ ఇంత అనైతికమా?'