Corona cases in India: భారత్‌లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఒక్కరోజే.. 2,47,417 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ ధాటికి మరో 380 మంది ప్రాణాలు కోల్పోయారు. 84,825 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 13.11 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
- మొత్తం కేసులు: 3,63,17,927
- మొత్తం మరణాలు: 4,85,035
- యాక్టివ్ కేసులు: 11,17,531
- మొత్తం కోలుకున్నవారు: 34,715,361
Omicron Cases In India
దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 28 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5,488కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Vaccination in India
భారత్‌లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే 76,32,024 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,54,61,39,465కు చేరింది.
అంతర్జాతీయంగా..
corona cases in world: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 31,45,916 మందికి కరోనా సోకింది. 8,032 మంది ప్రాణాలు కోల్పోయాు. దీంతో మొత్తం కేసులు 31,75,55,259కి చేరగా.. మరణాలు 55,30,352కు పెరిగింది.
- అమెరికాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 8,14,494 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. 2,269 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 6.43 కోట్లు దాటింది.
- ఫ్రాన్స్‌లో బుధవారం ఒక్కరోజే 3,61,719 కేసులు వెలుగుచూశాయి. మరో 246 మంది చనిపోయారు.
- బ్రిటన్‌లో మరో 1,29,587 మంది వైరస్ బారిన పడ్డారు. 398 మంది మృతి చెందారు.
- ఇటలీలో 1,96,224 కొత్త కేసులు బయటపడగా.. 313 మంది మరణించారు.
- స్పెయిన్‌లో 1,79,125 మందికి కొత్తగా వైరస్ సోకింది. మరో 125 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి: రూ.40 కోట్లు విలువ చేసే పురాతన విగ్రహాలు స్వాధీనం