Covid Cases in India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 12,899 మంది వైరస్ బారినపడగా.. మరో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 8,518 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.62 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.21 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.17 శాతం వద్ద ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 2.89 శాతం.. వీక్లీ పాజిటివిటీ రేటు 2.50 శాతం వద్ద కొనసాగుతోంది.
- మొత్తం కరోనా కేసులు: 4,32,96,692
- మొత్తం మరణాలు: 5,24,855
- యాక్టివ్ కేసులు: 72,474
- కోలుకున్నవారి సంఖ్య: 4,26,99,363
Vaccination India: భారత్లో శనివారం 13,24,591 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,96,14,88,807 కోట్లకు చేరింది. మరో 4,46,387 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా కేసులు పెరిగాయి. ఒక్కరోజే 3,64,517 మంది వైరస్ బారినపడ్డారు. మరో 721 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 543,984,866కు చేరింది. మరణాల సంఖ్య 63,40,108కు చేరింది. ఒక్కరోజే 3,84,816 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 51,91,06,781గా ఉంది.
- అమెరికాలో 12,749 కేసులు వెలుగుచూశాయి. 24 మందికిపైగా చనిపోయారు.
- తైవాన్లో మరో 53,707 కేసులు.. 181కుపైగా మరణాలు నమోదయ్యాయి.
- జర్మనీలో 80,019 కేసులు బయటపడ్డాయి.
- ఇటలీ ఒక్కరోజే 34,971 మంది కొవిడ్ బారినపడగా.. 45 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఆస్ట్రేలియాలో 26,927 కరోనా కేసులు, 64 మరణాలు నమోదయ్యాయి.
ఇదీ చూడండి : 'మహా'లో మరో 4వేల కేసులు.. మరణాలపై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన!