Covid Cases In India: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ ఉగ్రరూపం దాలుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో కొత్తగా 8,067 కరోనా కేసులు వెలుగుచూశాయి. ఇవి గురువారంతో పోలిస్తే... 2,669 కేసులు అధికం కావడం గమనార్హం.
Maharashtra omicron: మహారాష్ట్రంలో మరో నలుగురికి ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధరణ అయింది. వైరస్ కారణంగా.. మరో 8 మంది కన్నుమూశారు.
West bengal covid cases: బంగాల్లో కరోనా బీభత్సం సృష్టిస్తోంది. శుక్రవారం కొత్తగా 3,451 కేసులు వెలుగు చూశాయి. కొత్త కేసుల్లో 56శాతం కేసులు కోల్‌కతాలోనే నమోదు కావడం గమనార్హం. అక్కడ 1,954 కేసులు బయటపడ్డాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా ధాటికి మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని చెప్పింది. కాగా.. బంగాల్లో శుక్రవారం 1,150 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
Kerala coronvirus: కేరళలోనూ కరోనా కోరలు చాస్తోంది. ఆ రాష్ట్రంలో కొత్తగా 2,676 కేసులు నమోదయ్యాయి. మరో 353 మరణాలు వెలుగు చూశాయి. రాష్ట్రంలో కరోనా లెక్కలను ఆరోగ్య శాఖ సవరించడం వల్లే ఇంతటి స్థాయిలో మరణాలు నమోదయ్యాయని తెలుస్తోంది.
మరోవైపు... కేరళలో కొత్తగా 44 మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు తేలింది. ఫలితంగా... కేరళలో మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 107కు చేరింది.
ఇదీ చూడండి: దేశంలో 'ఒమిక్రాన్' విజృంభణ.. డెల్టాను మించి!
ఇదీ చూడండి: ఒమిక్రాన్ నుంచి కోలుకున్నా.. ప్రాణాలు కోల్పోయిన వృద్ధుడు