ETV Bharat / bharat

మహారాష్ట్రలో 5వేల కరోనా కేసులు.. దిల్లీలో రికార్డు స్థాయిలో..

Covid Cases In India: దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. చాలా రాష్ట్రాల్లో రోజూవారి కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. మహారాష్ట్రలో ఒక్కరోజే 5,368 మందికి వైరస్ నిర్ధరణ కాగా.. బంగాల్​లో కొత్తగా 2,128 మందికి మహమ్మారి సోకింది.

COVID-19
కొవిడ్-19
author img

By

Published : Dec 30, 2021, 9:37 PM IST

Covid Cases In India: దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. మహారాష్ట్రలో ఒక్కరోజే 5,368 మందికి వైరస్ నిర్ధరణ అయింది. వైరస్​తో మరో 22 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఒమిక్రాన్ విజృంభణ..

omicron cases in maharashtra: మహారాష్ట్రలో ఒమిక్రాన్​ వేరియంట్ వ్యాప్తి క్రమంగా విస్తరిస్తోంది. గురువారం ఒక్కరోజే ముంబయిలో 190 మందికి ఒమిక్రాన్ నిర్ధరణ అయింది. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 450కు చేరింది.

  • ఇక ముంబయిలో గురువారం ఒక్కరోజే 3,671 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరూ మరణించలేదు. బుధవారంతో పోల్చితే రోజూవారి కేసుల సంఖ్య 46.25శాతం పెరిగినట్లు అధికారులు తెలిపారు. దీంతో నగరంలో మొత్తం కేసుల సంఖ్య 7,79,479కు చేరింది. మరణాల సంఖ్య 16,375గా ఉంది.
  • బంగాల్​లోనూ భారీగా కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. కొత్తగా 2,128 మందికి మహమ్మారి సోకింది. పాజిటివిటీ రేటు 5.47శాతంగా ఉంది. కొవిడ్​-19 కేసుల దృష్ట్యా యూకేతో పాటు రిస్క్​ దేశాల నుంచి విమానాలను జనవరి 3 నుంచి రద్దు చేయనున్నారు.
  • దిల్లీలో కొవిడ్ ఉగ్రరూపం దాల్చుతోంది. కొత్తగా 1,313 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మరణాలు నమోదు కాలేదు. మే 26 నుంచి ఇంతమొత్తంలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. పాజిటివిటీ రేటు 1.73గా ఉంది.
  • కర్ణాటకలో కొత్తగా 707 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మరో ముగ్గురు మహమ్మారితో మృతిచెందారు. దీంతో కర్ణాటకలో కొవిడ్ కేసుల సంఖ్య 30,06,505కు చేరింది.

ఇదీ చూడండి: ఆ నగరాల్లో ఆందోళనకరంగా కరోనా 'ఆర్​-వ్యాల్యూ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.