ETV Bharat / bharat

'వారంతా ఆఫీస్​లకు రావాల్సిందే'.. ఆ రాష్ట్రాల్లో కేసులు తగ్గుముఖం

Covid Cases In India: కేరళలో కొవిడ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కొత్తగా 26,729 కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక దిల్లీలో పాజిటివిటీ రేటు క్రమంగా తగ్గుతూ వస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా కార్యాలయాల నుంచే విధులు నిర్వర్తించాలని సూచించారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్​.

Covid Cases In India
దేశంలో కొవిడ్ కేసులు
author img

By

Published : Feb 6, 2022, 8:30 PM IST

Covid Cases In India: కేరళలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 26,729 మంది వైరస్ నిర్ధరణ అయింది. మహమ్మారితో మరో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా వైరస్ నుంచి 49,261 కోలుకున్నారు.

దిల్లీలో కొత్తగా 1,410 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మరో 14 మంది వైరస్ కారణంగా మృతిచెందారు. దిల్లీలో పాజిటివిటీ రేటు క్రమంగా తగ్గుతూ వస్తోంది. తాజాగా దేశ రాజధానిలో పాజిటివిటీ రేటు 2.45 శాతంగా ఉంది. దిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 18,43,933కు చేరింది.

బిహార్​లో కొవిడ్ కేసులు తగ్గిన నేపథ్యంలో పాఠశాలలు ప్రారంభించాలని, రాత్రి కర్ఫ్యూను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

మహారాష్ట్రలో కొవిడ్-19 కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 9,666 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మహమ్మారి కారణంగా మరో 66 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 78,03,700కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 78,03,700గా ఉంది.

వారంతా ఆఫీస్​లకు రావాల్సిందే..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా కార్యాలయాల నుంచే విధులు నిర్వర్తించాలని సూచించారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. సోమవారం(ఫిబ్రవరి 7) నుంచి అన్ని స్థాయిల్లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయాల్లో హాజరు కావాలని తెలిపారు.

దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు తగ్గుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.

ఇదీ చూడండి: కరోనాతో భర్త మృతి.. మరిదితో మహిళ వివాహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.