దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. తాజాగా 27,071 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 98లక్షల 84వేల 100కి చేరింది. కరోనా కారణంగా మరో 336 మంది చనిపోగా.. మృతుల సంఖ్య 1లక్షా 43 వేల 355కు పెరిగింది.

పెరిగిన రికవరీ రేటు
కొత్తగా సుమారు 30వేల మందికి వైరస్ నయమవ్వగా.. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 93 లక్షల 88వేల 159కి పెరిగింది. 3లక్షల 52వేలకుపైగా యాక్టివ్ కేసులున్నాయి. దేశవ్యాప్త రికవరీ రేటు 94.98 శాతానికి ఎగబాకింది. మరణాల రేటు స్థిరంగా 1.45 శాతంగా కొనసాగుతోంది.
దేశవ్యాప్తంగా ఆదివారం రోజు 8లక్షల 55వేల నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. దీంతో మొత్తం టెస్ట్‌ల సంఖ్య 15కోట్ల 45లక్షలు దాటింది.
ఇవీ చదవండి: