ETV Bharat / bharat

'24 రాష్ట్రాల్లో 15 శాతానికిపైగా పాజిటివిటీ రేటు'

దేశంలోని 24 రాష్ట్రాల్లో 15 శాతానికి మించి కరోనా పాజిటివిటీ రేటు ఉందని కేంద్రం పేర్కొంది. మరో 7 రాష్ట్రాల్లో 5-15శాతం మధ్య ఉన్నట్లు తెలిపింది. అలాగే 12 రాష్ట్రాల్లో లక్ష చొప్పున యాక్టివ్​ కేసులున్నాయని వెల్లడించింది.

Union Health Ministry
కేంద్ర ఆరోగ్య శాఖ
author img

By

Published : May 7, 2021, 5:38 PM IST

దేశంలో కరోనా రెండోదశ విజృంభిస్తున్న వేళ కఠిన చర్యలు తీసుకుంటే మూడోదశకు అవకాశం ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. 24 రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు 15 శాతానికిపైగా ఉన్నట్లు తెలిపిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.. మరో 9 రాష్ట్రాల్లో 5-15 శాతం మధ్య ఉందని పేర్కొంది.

ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో లక్ష చొప్పున యాక్టివ్​ కేసులుండగా.. మరో ఏడు రాష్ట్రాల్లో 50 వేల నుంచి లక్ష వరకు ఉన్నట్లు తెలిపింది.

రాష్ట్రాల్లో హెచ్చుతగ్గులు

మహారాష్ట్ర, యూపీ, దిల్లీ, ఛత్తీస్​గఢ్​ రాష్ట్రాల్లో రోజువారీ కేసులు తగ్గుతున్నాయని కేంద్రం వెల్లడించింది. అయితే కర్ణాటక, కేరళ, బంగాల్​, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో కొవిడ్​ బాధితులు పెరుగుతున్నారని తెలిపింది.

వ్యాక్సినేషన్​ ప్రక్రియలో రెండో డోసు తీసుకోవడానికి ఎదురుచూస్తున్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్రం.

ఇదీ చూడండి: ఇకపై ఆ నంబర్‌ చెప్తేనే టీకా ఇస్తారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.