ETV Bharat / bharat

మాస్క్​ ఉల్లం'ఘనుల' నుంచి రూ. 54 కోట్ల వసూలు - మహారాష్ట్రలో మాస్క్​ ఫైన్​

కరోనా ఆంక్షల వేళ మాస్క్​ ధరించని వారి నుంచి జరిమానాల ద్వారా రూ.54 కోట్లకుపైగా వసూలు చేసినట్లు ముంబయి స్థానిక పాలనా యంత్రాంగం తెలిపింది. ఏడాది కాలంలోనే ఈ మొత్తం సేకరించినట్లు వెల్లడించింది.

mask fine
మాస్క్​ జరిమానా
author img

By

Published : May 5, 2021, 6:07 PM IST

మహారాష్ట్ర ముంబయిలో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్​ ధరించనివారికి విధించిన జరిమానాల ద్వారా ఏడాది కాలంలో రూ.54 కోట్లకు పైగా రాబట్టినట్లు అధికారులు తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. గతేడాది ఏప్రిల్​లో మాస్క్​ను తప్పనిసరి చేసింది బృహన్​ ముంబయి మునిసిపల్​ కార్పొరేషన్(బీఎంసీ)​. ఈ నిబంధనను ఉల్లంఘించినవారికి రూ.200 జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అప్పటినుంచి 26,87,339 మంది మాస్క్​ నిబంధనను ఉల్లంఘించగా.. వారి నుంచి రూ.54 కోట్లకుపైగా వసూలు చేశామని అధికారులు తెలిపారు. బీఎంసీ అధికారులు (రూ.47,36,62,800), పోలీసులు (రూ.62,65,7,800), రైల్వే అధికారులు (రూ.50,39,200) జరిమానాల ద్వారా రాబట్టినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: కరోనా కట్టడికి రాష్ట్రాల ఆంక్షల వ్యూహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.